6, జూన్ 2012, బుధవారం

katha nissabdam


              నిశ్శబ్దం


సార్ రెండు రూపాయలుంటే ఇప్పించరా సార్, ఆకలిగా వుంది నిన్నట్నుంచి ఏమి తినలేదు సార్ మీకు

పుణ్యముంటుంది. ఆకలిగా ఉంది సార్ అని 5 నిమిషల్నుంచి అడుగుతున్నాడు. పిల్లాడు కాని పాపం ఆ మనిషికి ప్రియురాలితో సరస

సంభాషనలు తప్ప పిల్లాడి మాటలు కాని, పది మంది చూస్తున్నారన్న పట్టింపు కానీ లేదు. ఆకలితో నీరసమొస్తుంది కావచ్చు కులాయి

దగ్గరికెళ్తున్నాడు, అప్రయత్నంగానే నా చేయి పర్సులో వెదుకుతుంది ఏవో కాగితాలు ఒక 10 రూ. నోటు, 4 రూ. చిల్లర చేయికి తగిలాయి

మొత్తంగా ఉన్నవి కూడా అన్నే నా మీద నాకే జాలేసింది. ఆకలితో వున్న కుర్రాడికి రుపాయికూడా ఇవ్వలేని పరిస్థితి, నా దగ్గరున్న వాటితో ఇంట్లోకి

ఒక్క రకం కూరగాయలైన కొనలేన ు మరి. ఇంతలో ఫ్లాట్ ఫాం మీదకి ఒకటో నెంబర్ బస్సొచ్చి ఆగింది. వెళ్లి బస్సులో కూర్చున్నాను. దూరంగా

పిల్లాడు మళ్లి ఆకలివేటలోకెళ్తున్నాడు. ఇంట్లోకి వెళ్తూనే అమ్మా రాధ ఎక్కడికెళ్లావమ్మా బయట అసలే ఎండలు మండిపోతున్నాయ్.. ఇవిగో

నీళ్లుతాగు అంటూ ఎదురొచ్చాడు నాన్న.. కుళాయి నీళ్లు కదా చల్లగా దాహాన్ని,స ఆకలిని కూడా తీర్చాయి. సికింద్రాబాద్‌లో ఇంటర్వ్యూ కెళ్లాను

నాన్న అని చెప్పి కాళ్లు కడుక్కొని స్టౌ మీద కుక్కర్ పెట్టి అమ్మ దగ్గరి కెళ్లాను. మంచం మీద కలతతో నిద్రపోతుంది. రెండేళ్ల కింద పక్షవాతంతో

అమ్మ మంచం పట్టింది. డిగ్రీ సెంకడియర్లో ఉండగానే అక్కయ్య పెళ్లి కరీంనగర్‌లోని బావతో జరిగింది. ఉన్న ఒక్క అన్నయ్య చదువుముగించి

ఆయనలాంటి ఫ్రెండ్స్‌తో కలిసి తిరగడాన్నే పనిగా చేసుకున్నాడు.  నాన్న  పోస్టల్ శాఖలో పనిచేసి ఈ మధ్యనే రిటైరయ్యారు. అదేపనిగా కుక్కర్

ఇస్తున్న విజిల్స్ విని స్టౌ దగ్గరికెళ్లాను. కూరలు తరముతున్నానే గాని ఆలోచనలు మొత్తం బస్టాండ్‌లో కనపడ్డ పిల్లాడి చుట్టే తిరుగుతున్నాయి.

ఆకలి.. ఎంత బలముంది దానికి ఆగమన్నా ఆగదు కదా. గుడిసెల్లో బతికే పేదోడికి తెలుసు. తుఫాన్ ను మించిన వేగఁ ఆకలికుందని,

ఏమైందమ్మా అంటూ నాన్నోచ్చాడు. ఏంటి నాన్న అంటూ
ఆలోచనల్లోంచి తేరుకొని కూరగిన్నెను స్టౌమీద పెట్టాను, అదే నువ్వెళ్లిన ఉద్యోగం సంగతి అన్నాడు, ఇంకా తెలీదు తర్వాత చెప్తామన్నారు అని

కూరవండటంలో నిమగ్నమయ్యాను ఓ నిట్టూర్పు విడిచి మందులు తీసుకురావడానికి బయటికెళ్లాడు, పాపం నాన్నని చూస్తుంటే జాలేస్తుంది

ఇంటిని నెట్టుకు రావడానికి అప్పులు కూడా చేస్తున్నట్టున్నాడీమద్య, అన్నయ్యని చూస్తుంటే ఇవ్వన్నీ పట్టించుకున్నట్టు కనిపించడంలేదు. ఈ మద్య

రోజు ఇంటికి రావడం కూడా మానేశాడు, ఏ రెండ్రోజులకొకసారో వస్తున్నాడు, సరిగా తినడం కూడాలేదు, ఏ అర్దరాత్రో ఇంటికొస్తున్నాడు

నాన్నకు కనబడడమేలేదు వీలున్నప్పుడల్లా నాన్న చెబుతూనే ఉన్నాడు ఒక్కోసారి కోపానికొస్తున్నాడు అమ్మకూడా చాలా బాదపడ్తుంది ఇంట్లో

పెళ్లికెదిగిన కూతురుంది కొంచెం చూసుకొని మసలరా అంటూ. నేను కూడా అడిగాను ఒకసారైతే విపరీతమైన కోపంతో తిట్టాను, దానికి

వాడు తనబాదనంతా నాతో పంచుకున్నాడు, రోెజూ ఆపీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లునొప్పెడుతున్నాయ్‌, చదివిన చదువుకి తగ్గ పనిలేదు, ఏదో

చిన్న ఉద్యోగమైనా సర్దుకుపోదామంటే ఎన్ని అవమానాలు బరించినా ఆకలిమిగులుతుంది తప్ప ఉద్యోగం కాదు, నేను సంపాదించి నాన్నను

సుఖపెట్టాల్సిన వయసుండి కూడా ఆయన కష్టంపైన బ్రతకడానికి సిగ్గనిపించి ఇంటికి రావాలంటేనే తల తీసేసినట్టనిపిస్తుందంటూ

భావురుమన్నాడు, ఓదార్చాను తప్పకుండా నువు సాధించాల్సింది సాదిస్తావని ఊరడించాను, మాంద్యం మబ్బులు వీడి అంతా

సద్దుమణుగుతుందని దైర్యం చెప్పాను, అంతకుమించి నేనేం చేయలేను కదా. ఈ సమస్య మా ఇంటివరకే కాదు మద్యతరగతి మనుసులంతా

బరించేదే ఐనా ఒక్కో సమస్యకి బీబత్సపు తుఫానంత బలముంది వాటన్నింటిని బరించే మౌన సంద్రంలాగానే మన మనసుండాలి అలా లేకుంటే

పొంగినా నష్ఠపోయేది ఏటి అంచునుండే భీద గుడిసెలే కదా.

బైటనుంచి వస్తున్న నాన్న చేతిలో మందులతో పాటు లెటర్‌లాంటిది ఉంది. ఎదురెల్లి మందులు తీసుకున్నాను, ఇదిగో

అమ్మ మీ తాతయ్య వాళ్ల దగ్గర్నుంచి లెటరొచ్చింది ఏం రాశారో చదవమ్మా, అంటూ కుర్చీలో జారగిలపడి కళ్లుమూసుకున్నాడు, విప్పాను ఈ

శివరాత్రికి అమ్మతో దేవునికి అభిషేకం చేయిస్తానని అమ్మమ్మ మెక్కుకుందిట అమ్మని నన్నూ  బయల్దేరిరమ్మని రాసుంది నాన్న, మరునాడు జూబ్లీ

బస్‌స్టేషన్‌లో బస్సుకోసం ఎదురుచూస్తుండగా అన్నయ్యోచ్చాడు, ఎటెల్లావ్‌ ఈరోజు ఊరెళ్లాలి అమ్మని బస్టాప్‌ దగ్గర దింపడానికి ఉండమని

చెప్పాను కదా, అని కోప్పడ్డాను జేబులోంచి మూడువందలు తీసిచ్చాడు ఎక్కడివి మళ్లీ కోప్పడ్డాను ప్రెండ్‌ దగ్గర తీసుకొచ్చాను నోర్మూసుకొని

తీసుకో విసుక్కున్నాడు, ఇంతలో ఆవునూర్‌ బస్సొచ్చి ప్లాట్‌ఫాంపై ఆగింది, అమ్మను తీసుకెల్లి బస్సులో కూర్చోబెట్టి జాగ్రత్త చెప్పి ఇద్దరూ

వెళ్లిపోయారు, ఊరుచేరేసరికి రాత్రయింది స్నానం చేసి వసారాలో వచ్చి కూర్చున్నాను చల్లగాలికి మనసుకూడా తేలికయ్యింది ఆవునూర్లోనే

చిన్నప్పుడు తొమ్మిదో తరగతి వరకు చదివాను, లోకం పోకడ తెలియని వయసులో చాలా సరదాగా రోజులు గడిచాయి, అప్పటి స్నేహితులు,

ఆచల్లని ఫైరగాలి గుడిలో శివరాత్రికి జరిగే జాతరకి చుట్టుపక్కల పల్లెలవారు, ఎక్కడెక్కడికో వలసపోయిన ఆఊరివాళ్లు వచ్చేవారు, కాని ఇప్పుడు

పరిస్థితులు మారినాయ్‌ అందుకు కరువు కారణమౌ లేక యాంత్రిక యుగంలో పనులుమాని రావడానికి వాళ్లకి మనసొప్పకపోవడమో కారణం

కావచ్చు.

అమ్మని జాగ్రత్తగా పట్టుకొని గుడిమెట్లు ఎక్కుతున్నాను, చేతిలోపూలు కిందపడబోతుంటే వాటిని అందుకునే

ప్రయత్నంలో అప్రయత్నంగా అమ్మని వదిలిపెట్టాను, తుళ్లి పడబోతున్న అమ్మని వెనుకనుండి ఒడిసిపట్టుకున్నాడు సుధీర్‌ థాంక్స్‌ సుధీర్‌ ఎలా ఉన్నావ్‌

అని పలకరించాను ఆ బాగున్నాను ఎప్పుడొచ్చారు అమ్మ ఆరోగ్యం కుదుటపడిందా అంటూ మెట్లెక్కడానికి సాయపడ్డాడు, చిన్నప్పుడు నాతోనే

చదివాడు చాలా అల్లరికుర్రాడు ఏదో ప్రైవేట్‌ స్కూల్‌ నడుపుతున్నాడని తెలిసింది, చిన్నప్పట్నుంచి నేనంటే కొంచెం ఎక్కువ అభిమానం

చూపించేవాడు, ఆవునూర్లో ఈ పది రోజులు కొంచెం సరదాగా గడిచిపోయాయి, కాలుష్యం లేని పచ్చని వాతావరణం, కల్మషం లేని మనుషుల

మధ్య  నందంగా కొన్ని బాధలనైనా మరిచిపోగలిగాను. రేపు తిరుగు ప్రయాణం  ఈ పదిరోజులు అమ్మకు మెడిసిన్ దగ్గరనుండి నాకు కావాల్సిన

చిన్న చిన్న పనులన్నీ మామయ్య కంటే  ఎక్కువగా సుధీరే దగ్గరుండి చూశాడు. సాయంత్రం గుడి నుంచి బయటకొస్తుంటే ఎదురొచ్చాడతన.

ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రేపు ఉదయాన్నే వెళ్లిపోతున్నాము అన్నాను. మౌనంగా నిలబడ్డాడు. ఊర్లోకి నడుస్తున్నాం ిఇద్దరి మధ్య నిశ్శబ్దమే.
మా వీధి మలుపు తిరుగుతుండగా నువ్వంటే నాకిష్టం నువ్వొప్పుకుంటే పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. ఇంకా ఇరవై రోజుల్లో హైదరాబాద‌

వస్తారు. అప్పటిలోగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పూ అంటూ ఇంకోమాట మాట్లాడనీయకుండానే వెళ్లిపోయాడు. ఏం చెప్పాడో కొంచెంసేపు

అర్థం కాలేదు. ఐనా చెప్పడానికి ముందే నిశ్శబ్దం తప్ప పరిస్థితులు బేరిజు మాని ఒకవైపు మనసు పోరుపెడ్తూనే ఉంది. తొందరగా విషయం

తేల్చమని అప్పుడే సిటీకొచ్చి రెండ్రోజులైంది. అదే వాహనాల రోత, కాలుష్యపు మోత, పక్కింటి వాళ్లొచ్చి ఫోనిచ్చి రమ్మంటే నాన్నెళ్లాడు. వస్తూనే కళ్లలో

బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏమైంది నాన్న అలా ఏడుస్తున్నావ‌ అక్కయ్యకి అస్తమా పెరిగిందట కోమాలోకి వెళ్లిందని రమ్మని చెప్పారు అంటూ

బావురుమన్నాడు. అన్నయ్యతో కలిసి నాన్న కరీంనగర్ వెళ్లారు. ఏమెందోనని ఇక్కడ అమ్మకి నాకు ఒకటే బాధ. అంత బాధలోనూ అమ్మ గుమ్మం

వరకెళ్లి ఎదురుచూస్తూ ఏడుస్తుంది. మళ్లీ ఫోన్ అక్కయ్య చనిపోయిందని అమ్మని తీసుకుని వెళ్లాను. ఏంటీ బాధలు అన్ని అనుభవించే

వారికేనా, మరో మూడురోజుల తర్వాత అన్ని కార్యాలు ముగిశాయి. అందరి మనసుల్లోను ఒకటే బాధ నాకైతే ఒక ఆప్త మిత్రురాల్ని కోల్పోయిన

దు:ఖం ఆగడం లేదు. అవును మరి అక్క మాకోసం ఎంత కష్టపడింది. తను చదవాల్సిన వయసులోనే ఇంటి కోసం కుట్టుపనిచేసేది. ఆ పనిచేస్తే

అస్తమా పెరిగిపోతుందని తెలిసినా సంసారాన్ని గట్టెక్కించడానికి తను ఓ ప్రమిదలా మారింది. ఆ కష్టమే ఇప్పుడు ఆమేను మాకందని తీరానికి

తీసుకుపోయింది. వీటన్నింటికి కారణం ఉండీలేని మధ్యతరగతి బతుకేనని స్పష్టంగా తెలిసినా వీటిని మార్చడానికి శ్రుష్టి మొదట్నుంచి

ప్రయత్నిస్తున్నా ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాయి ఇంకెంత కాలమైనా ఇలాగే ఉంటాయి కూడా...
హైదరాబాద్ ప్రయాణమవుతుంటే నాన్న వాళ్ల చెల్లొచ్చి అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరపడం మంచిదని అడగాల్సొస్తుంది.

రాదని వీడికిచ్చి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. పెద్దది ఇలా పోతుందని అనుకోలేదు కదా మళ్లీ వేరే పెళ్లి చేస్తే నీ మనవడిని వచ్చిన పిల్ల ఎలా

చూస్తుందో అందుకే అడుగుతున్నా ఏమనుకోవద్దు అంది. పిడుగుపడ్డట్టయింది ఇంటికొచ్చిన తర్వాత నాన్నాడిగాడు నీ అభిప్రాయం చెప్పమ్మా

అని ఏం చెప్పాలి. వచ్చిన దగ్గర్నుంచి అమ్మా నాన్నా ఇద్దరూ కలిసి వీలున్న ప్రతిసారి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో నీకు పెళ్లి చేయడం చాలా

కష్టమమ్మా ఇంకా ఎన్నాళ్లు కష్టపడ్డా నిన్ను సుఖపెడ్తామనే ఆశలేదు అన్నయ్యకి ఇంటి విషయాల మీద పట్టింపులేదు పైగా బావ మంచివాడు

నువ్వైతే అక్క కొడుకుని జాగ్రత్తగా చూసుకోగలవు అని రోజులు గడుస్తున్నాయి. నాలో సంఘర్షణ రోజురోజుకి పెరిగిపోతుంది. ఎన్ని కలలు

కన్నాను చిన్నప్పుడు ఈ జీవితంపై ఏదో సాధించాలని, పెళ్లయ్యాక హాయిగా ఉండాలని, కాని మధ్యతరగతికవన్నీ మిథ్యలే, దానికి నా

చేతగానితనాన్ని కారణంగా నిందించినా ఫలితం శూన్యం. సుధీర్‌ గుర్తొచ్చాడు ఆ కళ్లలో ఆర్తి నన్నింకా వీడిపోవటం లేదు, రేపు తనోస్తానన్నా

విషయం గుర్తొచ్చి బాధగా నిట్టూర్చాను, మర్నాడూ పరద్యానంగానే ఉన్నా ఇంతలో కూరగాయలు తీసుకురామ్మా.. నాన్న చెబితే సంచి చేతిలోకి

తీసుకుని బయలుదేరాను, రొడ్డుపై నడుస్తున్న మాటే కానీ కనిసించేది మాత్రం శూన్యం, పరద్యానంలో ఎటువెళ్తున్నానో అనే స్ర్పుహ కూడా లేదు,

ఇంతలో వేగంగా వస్తున్న టిప్పర్‌ రెప్పపాటులో నాపైనుంచి వెళ్లిపోయింది, ఎక్కడున్నానో అర్థం కావడంలేదు, బలవంతంగా కళ్లు తెరుస్తుంటే

ఒక్కొక్కరే అస్పష్ఠంగా మసకతెరలు తీసినట్టుగా కనిపిస్తున్నారు నాన్న, అమ్మ, బావ, అన్నయ్య, సుధీర్‌ అలాగే చూపుతో పాటు మనసుకూడా

ఆగిపోయింది, క్సణం గడిస్తే మనసులో ద్రుశ్యం మారుతుందనుకుందో ఏమో కాలం కూడా ప్రాణంతో కలిసి అక్కడే ఆగిపోయింది శాశ్వతంగా.సుధీర్‌ గంగాడి
9394486053