7, ఫిబ్రవరి 2022, సోమవారం

గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావు గారి అభినందనలు



మన ‘ఇగురం’ పుస్తకం గురించి సీఎం కేసీఆర్ గారు స్వయంగా తెలుసుకొని అభినందించిన సందర్భం మరిచిపోలేనిది.

మరిచిపోలేని రోజు
27 వ తారీఖు, గురువారం
‘ఇగురం’ పుస్తకం విడుదలై సరిగ్గా నెల దాటింది.
కిటికీల, దర్వాజల సందుల్లోంచి దూసుకొస్తున్న శీతల గాలులు ముప్పిరిగొని, నిద్రలేవకుండా బద్దకించేలా చేస్తున్నాయి. ఇంతలో ఎనిమిదైతుంది అన్న రేవతి పిలుపుతో తప్పనిసరిగా లేచి త్వరత్వరగా రెడీ అయ్యాను.
ఉదయం 8.30 - 9 మద్య ఇంట్లోంచి మామూలుగానే ఆఫీసుకు బయల్దేరాను,
‘ఇగురం’ పుస్తకాల కాపీలు ఎక్కువగా లేకపోవడం, కరోనా ఎక్కువైతుందనే వార్తలతో ఇవాళ ఎవర్నీ కలువలేను అనుకొని ఇగురాన్ని చేతుల్లోకి తీసుకోలేదు,
బండి స్టార్టు చేసి వెల్తూ వెల్తూ ఉండగా ఆఫీసుకు దగ్గర్లో ఉన్నప్పుడు పోన్ రింగవడంతో అటెండ్ చేసాను, మల్లీ జేబులో సెల్లుని పెట్టేటప్పుడు నొటిఫికేషన్లో వాట్సాప్ న్యూ మెసెజీ సింబల్ కన్పించడంతో యదాలాపంగా వాట్సప్ తెరిచాను.
అందులో మెసెజి మినిస్టర్ గంగుల కమలాకర్ గారు హైదరాబాద్ వచ్చారు అని.
వెంటనే బండి రూట్ మార్చి మినిస్టర్ క్వార్టర్సుకు చేరుకున్నాను.
ఆపీసంతా సందడి సందడిగా ఉంది, రెగ్యులర్గా నా పనుల్లో నేను ఉండిపోయాను.
లంచ్ ముగిసిన వెంటనే ప్రగతిభవన్కి వెల్లాలి, సిద్దంగా ఉండండి అని అలర్ట్.
కేటీఆర్ గారితో మీటింగ్ ఉందని తెలియడంతో...
వెంటనే లంచ్ చేసేసి సిద్దమైపోయాను.
సరిగ్గా 3.30 గంటలకు ప్రగతి భవన్కి చేరుకున్నాము,
కరోనా జాగ్రత్తలతో మినిస్టర్ గంగుల కమలాకర్ గారు, కరీంనగర్ నూతన అధ్యక్షుడు శ్రీ జీవి రామకృష్ణారావు గారు మరికొంత మందితో సీఎంవో ఆపీసులోకి చేరుకున్నాం.
అక్కడికెల్లాక తెలిసింది ఈ రోజే సీఎం గారిని కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడితో పాటు మరికొంత మంది మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు అని,
అప్పుడనిపించింది అయ్యో.... ఇవాలే ‘ఇగురం’ పుస్తకాన్ని తీసుకురాలేదే.... ఒకవేళ అవకాశం వస్తే సీఎం గారికి ఇచ్చేవాడినే... అని కొంచెం నిరాశ జనించింది. అలా అక్కడ నిలబడి ఉండగానే,
పదినిమిషాల తర్వాత మినిస్టర్ గారు పార్టీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, ఒడితెల సతీష్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గార్లకు సీఎం గారి నుండి పిలుపు రావడంతో వారు మాత్రమే సీఎం నివాసంలోకి వెల్లారు.
వెంటవెల్లిన నాతో పాటు మిగిలిన వాళ్లను వేయిటింగ్ రూంలో కూర్చోబెట్టారు.
అయ్యో... ఇక ఈ రోజుకు సీఎం గారిని కలిసే అవకాశం మాకు లేదేమో అనుకొన్నాను, ఇంతలోనే పుస్తకం కూడా లేదు కదా అని అనిపించింది,
అక్కడ ఉన్న పత్రికలు తిరగేస్తున్నాను.
అరగంట తర్వాత సీఎంవో సిబ్బంది వచ్చి మినిస్టర్ గంగుల కమలాకర్ గారికి సంబందించిన వారిని రమ్మంటున్నారు అనడంతో అందరం అటు వైపు వెల్లాం.
సెక్యూరిటీ చెకింగ్స్ పూర్తి చేసుకొని లిప్ట్ ద్వారా మెదటి అంతస్థుకు చేరుకున్నాం.
అప్పటికే చాలా జిల్లాలకు సంబందించిన వారు ఒక్కొక్కరుగా అక్కడ వెయిట్ చేస్తున్నారు.
మినిస్టర్ గంగుల కమలాకర్ గారు మమ్మల్ని తీసుకొని నేరుగా సీఎం గారు ఉన్న రూంలోకి వెళ్లారు.
తెల్లటి చొక్క, పంచె కట్టు కొని అక్కడికొచ్చిన వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ ఒక్కొక్కరితో యోగక్షేమాలు విచారిస్తూ వారిని మాట్లాడిస్తూ అధ్యక్షులను సన్మానిస్తూ పోటోలు దిగుతున్నారు సీఎం కేసీఆర్ గారు.
ఆ రూపం చూసిన నాకు తన్మయత్వంగా అనిపించింది, ప్రసన్న వదనంతో ఉన్న కేసీఆర్ గారిని చూస్తూ...
గతంలో ఉద్యమ సమయంలో చండ్రనిప్పులు కక్కుతూ బావోద్వేగ ప్రసంగాలు ఇచ్చిన రూపాన్ని,
నిమ్స్ హాస్పిటల్ బెడ్ పై చావు అంచుల్లో సైతం మొక్కవోని దీక్షతో వెలుగిన మొఖం ఒక్కసారిగా నా కళ్లముందు కదలాడాయి.
సీఎం కేసీఆర్ గారిని ఉద్యమంలో, టీవీల్లో, ప్రత్యక్షంగా ప్రెస్ మీట్లలో, సభల్లో ఎన్నోసార్లు చూసినప్పటికీ అంత దగ్గరగా చూడడం మొదటి సారి కావడంతో నాలో నాకు తెలియకుండానే ఒకరకమైన ఉద్వేగం కలుగుతుంది.
విశాలమైన హాళ్లో మూడు వైపులా పొందికగా అమర్చిన సోపాలు, మద్యలో విశాలమైన టీపాయ్, ఒకవైపున సీఎం కేసీఆర్ గారు నిల్చొన్నారు, హాళ్లోకి వెల్లిన వారు సోఫాల వెనుకగుండా తిరిగి సీఎం గారి పక్కన వరుసగా నిల్చుని ఆయన్ని కలువడానికి ముందుకు కదులుతున్నారు.
దాదాపు అన్ని జిల్లాలకు చెందిన మంత్రులు ఆయా జిల్లాల నూతన అధ్యక్షులతో కలిసి కేసీఆర్ గారిని కలుస్తున్నారు. సీఎం గారు వచ్చిన వారిని మందలిస్తూనే, వారితో పోటోలు దిగుతూ అక్కడే ఉన్న మంత్రులు ఇతర ఉన్నతాధికారులతో కొన్ని అధికారిక అంశాలపై సూచనలు చేస్తున్నారు.
ఇంతలో మంత్రి గంగుల కమలాకర్ గారితో కలిసి మేం పదిమందిమి సీఎం గారితో పోటో దిగడానికి ముందుకు అడుగేసాం.
ఒక్కొక్కరిని మా మంత్రిగారు కేసీఆర్ గారికి పరిచయం చేస్తున్నారు. సీఎం గారు వారిని నవ్వుతూ రిషీవ్ చేసుకుంటూ వారి యోగక్షేమాలు విచారిస్తూనే మద్య మద్యలో అధికారులకు, మంత్రులకు సూచనలు చేస్తున్నారు.
ఇలా సీఎం గారికి దగ్గరవుతున్న ఒక్కో క్షణం నాలో ఉద్విగ్నత మరింతగా పెరుగుతుంది, ఏమని మాట్లాడాలి, అసలు సీఎం గారితో మాట్లాడే అవకాశం ఉంటుందా...
లేకున్నా సరే....,
కనీసం ఆయనతో ఫోటో దిగినా చాలు నా జన్మ ధన్యం
దానికి తోడు ఇప్పటికే వేయి బుక్కులు అయిపోయి మలి ముద్రణలో ఉన్న ఇగురంకు మరింత బూస్టప్ దొరుకుతుంది...
అయ్యే... ఇవాలే బుక్ నా చేతిలో లేదే...
అని ఇలా పరిపరివిదాల ఆలోచిస్తుంది మనసు.
అనుకున్న గడియ రానే వచ్చింది.
సీఎం గారికి నమస్కరిస్తూ ముందుకు అడుగేసాను, కేసీఆర్ గారు నా వైపు తిరిగి నవ్వుతూ నమస్కరించారు.
ఆ చూపు నేరుగా నను తాకే సరికి నా ఉద్వేగం తారా స్థాయికి చేరింది. సార్ నన్ను చూసారు చాలు అని సంబరపడ్డాను. అదే క్షణంలో పోటో సరిగా రాదేమో అనే బెంగ మనుసులోకిచ్చింది, ఎందుకంటే సీఎంగారు నన్ను చూసి నమస్కారం పెట్టిన సమయంలో అతని పక్కన మా ఇద్దరి మద్యలో కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన పక్కకి జరగ్గానే కేసీఆర్ గారి పక్కనే నిల్చొని పోటోకి ఫోజివ్వాలనుకున్నాను.
ఇదంతా క్షణ కాలంలో జరిగిపోతుంది, కానీ నేను ఆ సువర్ణ క్షణాలను సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను కాబట్టి అక్కడే కాలం ఆగిపోయిందేమో అనిపించింది. చాలా సంతోషంగా ఉంది.
ఇంతలో మద్యలో వ్యక్తి జరగడంతో సీఎం గారి పక్కకి వెల్లి నిలుచున్నాను, మంత్రి గంగుల గారు నన్ను పరిచయం చేసారు. సీఎం గారు మరొక్కసారి నన్ను చూసి విష్ చేస్తూనే మంత్రి సభిత గారికి ఏదో సూచిస్తున్నారు. ఆక్షణం చాలా సంతోషంగా అనిపించింది.
అంతలోనే అబ్బా.....
సబిత గారితో సారు ఇప్పుడే మాట్లాడాలా....
ఇంకోసారి నన్ను కనులారా కేసీఆర్ గారు చూస్తే బాగుండు అనుకుంటున్నాను...
ఇంతలో వేరే వాళ్లు పోటో దిగడం కోసం ముందుకొస్తున్నారు.
ఇక గత్యంతరం లేదు సీఎం గారికి ఎడంగా దూరంగా జరగాల్సిన సమయమొచ్చింది.
తొలిసారిగా... నాకు అంత సంతోషాన్నిచ్చిన ఆ కాలంపై ఇంకాసేపు ఇక్కడే కాలం ఆగిపోతే బాగుండు అని
కోపం వచ్చింది.
కానీ మనకు అనుకూలంగా అన్ని జరిగితే అది కాలం ఎలా అవుతుంది అనుకొంటూ తప్పనిసరి పరిస్థితుల్లో బారంగా వెనుకడుగు వేయడానికి నా ఎడమ కాలిని వెనుకకు జరిపాను,
కానీ నా కాళ్ల మద్య సమన్వయం లోపించింది, వెనుకకు వెసిన ఎడమ కాలికి కుడి కాలు సహకరించడం లేదు, వెనుకకు రావడానికి మొరాయిస్తుంది. నిజానికి అక్కడ వెల్లండి అని చెప్పేవాళ్లు ఎవరూ లేరు, గన్ మెన్లు కాని, వ్యక్తిగత సిబ్బంది కానీ ఎవరికి అలా సూచించడం కూడా లేదు, కానీ అప్రయత్నంగానే అందరూ సీఎం గారి విలువైన కాలానికి బందీల్లా... సుశిక్షుతులైన సైనికుల్లా... వచ్చిన తమ పనిని ముగించుకొని నిబద్దతతో కూడిన క్రమశిక్షణతో వెల్లిపోతున్నారు.
సీఎంగారు నన్ను కండ్లతోనే విష్ చేసి పోటో వైపు చూసి మల్లీ అటు తిరిగి మంత్రి సబిత గారితో ఏదో మాట్లాడుతున్నారు.
మరో వ్యక్తి సార్ తో పోటో దిగడానికి ముందుకు వస్తున్నారు...
ఇక నేను కూడా ఏం చేయలేను, సార్ సమయాన్ని గౌరవించాల్సిందే అనుకొని కుడికాలును కూడా వెనక్కి తీసుకోబోతున్నాను.
అప్పుడు జరిగింది...
నా జీవితంలో మహాద్బుత ఘట్టం, నేనూహించని పరిణామం,
వెనక్కి వెళ్లబోతున్న నా వైపు చేయి చాపుతూ కేసీఆర్ గారు ఒక్కసారిగా
‘ఇగురం రైటర్ కదా మీరు’ అన్నాడు...
అంతే వెనక్కి వెల్లబోతున్న నేను అక్కడే స్థానువులా నిల్చుండిపోయాను,
ఒక్కసారి నేను విన్నది కరక్టేనా అని అనుమానం కలిగింది,
షాక్ కొట్టినట్టుగా శరీరమంతా వేల వాట్ల విద్యుత్ ప్రవాహం పరుగులెట్టింది.
ఇలా నా పరిస్థితి ఒక అనిర్వచనీయమైన ఆనందంలో ఉంటే....
అప్పటివరకూ అక్కడే ఉన్న దాదాపు పది మంది మంత్రులు, ఇరవై మంది వరకూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంతో మంది విఐపీలు అంతా సీఎంగారు మందలించిన ఈ వ్యక్తి ఎవరూ అంటూ ఒక్కసారిగా నా వైపు చూపు దాల్చారు...
ముందుకు రాబోతున్న మరో వ్యక్తి టక్కున ఆగి వెనక్కి వెల్లారు.
తేరుకున్న నేను
‘స...ర్... స ర్... సర్... మీకు ఇగురం గురించి తెలిసిందా....
మీ వరకూ పుస్తకం చేరిందా...... ధన్యున్ని సర్....’
అని తడబడుతూ..... నాకు తెలియకుండానే పరవశంతో మాట్లాడాను.
అప్పటికే కేసీఆర్ గారు చాచిన చేయి నా భుజాన్ని తాకి తనవైపు లాక్కుంటుంది. నా ఒళ్లు నా అదుపులో లేదు, జీవితంలో ఎన్నడూ చూడని, అనుభవించని అనుభూతికి లోనవుతుంది శరీరం.
ఇంతలో సీఎం గారు మల్లీ
‘నేను విన్ననయ్యా... చదివానయ్యా ఇగురం పుస్తకాన్ని’ అని అన్నారు‘
అప్పటికే సారుకు అతి దగ్గరగా ఉండడంతో మరింత ఆశ్చర్యంతో...
’సర్ మీరు చదివారా..... మీ దాక ఇగురం పుస్తకం చేరిందా’ అని అన్నాను.
వెంటనే కేసీఆర్ గారు ‘నా బుక్కు ఏది’ అంటూ చేయి చాచి అడిగారు....
ఒక్క క్షణం
అయ్యొ.... కాలం ఎంత కక్ష కట్టింది నాపై...
రోజు పదుల సంఖ్యలో ‘ఇగురం’ బుక్కులు చేతపట్టుకొని తిరిగే నేను, ఇవాల కనీసం ఒక్క పుస్తకం లేకుండా రావడమేంటి అని నన్ను నేనే తిట్టుకున్నాను.
కేసీఆర్ గారు అలా అడిగే సరికి ఊహించని నేను, ఏం సమాదానం చెప్పాల అని తటపటాయించాను,
ఇంతలో మంత్రి గంగుల కమలాకర్ గారు కల్పించుకొని
‘సార్, సుధీర్ పీఆర్వోగా పనిచేస్తున్నాడు, అనుకోకుండా ఇక్కడికి వచ్చాడు సర్, బుక్ తీసుకురాలేకపోయాడు’ అని అన్నాడు
వెంటనే నేను కూడా...
‘సర్ మిమ్మల్ని కలిసే అవకాశం ఇవాల వస్తుందని అనుకోలేదు సర్, బుక్ వెంటలేదు’ అన్నాను.
వెంటనే సర్ మంత్రి గంగుల గారి వైపు తిరిగి ‘పర్లేదు’ అంటూనే నా వైపు తిరిగారు దగ్గరికి తీసుకొని బుజంపై చేయితీసి పోటోగ్రాఫర్ వైపు చూసారు,
అహా ఏదో ఫోటో దొరుకుతుంది అనుకున్నా... అలాంటిది అధ్బుతమైన ఫోటో రాబోతుంది అని సంబరంతో పోటో దిగడం అవగానే వెనక్కి రాబోతున్న నాతో
‘ఇగురం పుస్తకం చాలా బాగుంది’
‘అధ్బుతంగా రాస్తున్నావు’
‘కీప్ రైటింగ్’
‘రాయడం వదలొద్దు’
అన్నారు సీఎం కేసీఆర్ గారు
‘థాంక్యూ సర్, మొదటి పుస్తకానికే మీ ఆశీర్వాదం దొరకడం నా అదృష్టం సర్’ అని వెనక్కి అడుగేసాను.
కళ్లతోనే ఆల్ ద బెస్ట్ అన్నట్టుగా చూస్తూ మరొకరిని అంతే ఆప్యాయంగా విష్ చేసారు సీఎం కేసీఆర్ గారు.
అంతే అక్కడినుండి వెనక్కి వచ్చేసి, ఆ రూం బయటకొచ్చిన తర్వాత
మా మంత్రి గారితో పాటు, నా చుట్టూ ఉన్నవాళ్లు మరోసారి నన్ను అభినందించారు.
కానీ నేను ఇంకా ఆ తన్మయత్వపు షాకులోనే ఉన్నాను. వాళ్లు అంటుంది వింటూనే అసలు ఇది కలా.... నిజమా.... అని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను.
అసలు ఇవాల బుక్ తీసుకురావా.... అన్నారు. మరికొంత మంది ఏం బుక్ రాసావు, అది ఎక్కడ దొరుకుద్ది, సీఎం గారే బాగుంది అన్నారంటే ఆ బుక్ చదవాల్సిందే అంటున్నారు... అలా
సీఎం కేసీఆర్ గారు ఎందుకు ప్రత్యేకమో చర్చించారు. కనీసం ఒక్కసారి చూడకపోయినా... కేవలం ఒక బుక్కు మాత్రమే రాసిన గంగాడి సుధీర్ లాంటి వాళ్ల పుస్తకాన్ని సైతం నెల రోజుల వ్యవదిలోనే ఇంత పరిశీలించారు, పరిశీలించడమే కాదు సిరిసిల్లకు చెందిన అతను వేరేవాళ్లతో వచ్చినప్పటికీ గుర్తుపెట్టుకొని పుస్తకం గురించి మాట్లాడారంటే సామన్య విధ్వత్తు కాదు అన్నారు.
నాకు కూడా ఇన్ని రోజులు కేసీఆర్ గారి గురించి చాలా గొప్పగా విన్నాను....
ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత నేను విన్నది చాలా తక్కువనే అనిపించింది.
జనభాహుళ్యంలోకి వెల్లిన పుస్తకాన్ని తెప్పించుకొని చదివడమే కాకుండా, పుస్తకంలోనో, పేపర్లోనో, పెస్బుక్లోనో... ఎక్కడో చూసిన నాలాంటి ఒక సామాన్య రచయిత తన ముందుకొచ్చి నిలబడ్డప్పుడు, వందల మంది పక్కనే ఉన్నా... అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నా... తొలిసారి ఆ వ్యక్తిని చూస్తున్నా.... పోల్చుకొని గుర్తుబట్టడమే కాకుండా.... పేరు పెట్టి పలకరించడం సామాన్య విషయం కాదు, తన రచనల్లోని గొప్పతనాన్ని కాపాడుకొమ్మని ఆశీర్వదించడం అందరికీ సాధ్యం కాదు.
అందుకే ఆయన కేసీఆర్, తెలంగాణ నిరంతరం గుర్తుపెట్టుకొనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,
రాఘవరావు, వెంకటమ్మలు కన్న కారణ జన్ముడు.
తెలంగాణ తల్లి దాస్యశృంఖలాలు తెంపిన పోరాట యోదుడు
జన్మభూమిని సస్యశ్యామలం చేస్తున్న నిత్య కృషీ వలుడు.
జై కేసీఆర్
జయహో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
(ఈరోజును మర్చిపోలేకుండా మార్చిన, కేసీఆర్ గారిని కలిపించిన గంగుల కమలాకర్ గారికి నా ఆజన్మాంతం రుణపడే ఉంటాను)
మీ గంగాడి సుధీర్
ఈ ‘ఇగురం’ కథా సంపుటి కొనడానికి
Order your copy now
Or 160Rs/- GPAY/PPAY to 9394486053 with full adress.