31, మార్చి 2020, మంగళవారం

భరత పుత్రులం మేం



కార్గిల్ లో ఉన్నది కదన రంగం
గుండెలున్నది మండె గుండం
ఫిరంగి గుల్లను ఎదుర్కొందాం
పిచ్చి కుక్కను తరిమి కొడదాం
ఆకలన్నది మరచిపోదాం
అమ్మకోసం సేవ చేద్దాం
కారుచీకటి కమ్ముకొన్నది
మేఘాన్నే తొలిగిద్దాం
నరకులని చంపి
రాక్షస వదనే మెదలు పెడదాం
బుసలు కొట్టే కాల సర్పపు
కొరలనే మనం పీకేద్దాం
పులి కాదది పిల్లేరా
తరుముదాం నువు రారా
కదన రంగం మాదిరా
కల్లోలం చేయ జాలవురా
ఎగిసిపడే అలలం మేం
నీ తల పగలక తప్పదు.

ప్రేమే దైర్యం



మనసులో కురుస్తున్న వర్షానికి
మేగాలంటూ ఉండవు
మదిలో ఉరుముతున్న భావాలకూ
పిడుగులంటూ పడవూ
గాలివానే కమ్ముకొచ్చినా...
గుండె దైర్యం బెదర నీయకు
అమ్మనాన్నలు వద్దన్నారని
అమ్మణినే వదిలి పెట్టకు
ఆకలైతే దోచుకోకూ
తోడుగా నువ్వోదిలి పోకూ
గాలి వానలు ఎదురైనా
పిడుగు పాటులు ప్రక్కనున్న
నీ దారిలో నువు సాగిపో
వెనకనున్నది మరచిపో...

ప్రియురాలి కోసం


ఎదో చేయాలనీ ఎప్పుడో చెప్పాలనీ
ఎవరినో చేరాలనీ తెలుపుతుంది మనసు
ఉరకలేసే గోదారై పరుగులు తీస్తున్న
యవ్వనాన్ని నీ చిరునామా ఎక్కడనీ...
తరుముకొచ్చే ఆవేశాన్ని తన్మయంగా పలకరించి
తపన కోసం బరువుదించి
నా అంతరంగ తీరాలలోని
భావాలనూ రాగాలనూ తనముందుంచాలని
ఉలిక్కిపడే యవ్వనాన్ని
ఉప్పైనై వచ్చే పరవశాన్ని
తరుముకుంటూ... తడుముకుంటూ...
నీఓడిలొ ఉన్న పూల జరులను చూసి ప్రియతమా..
కలువ రేకుల్లాంటి నీ కన్నుల లోంచి చిలకరిస్తున్న
ఆనంద భాష్పంలా నేనెప్పుడు...

తొలిరూపం



అదిగో చూడు అక్కడ
వికసించిందో నందనవన పుష్పం
నా గుండెల్లో ఊగిసలాడింది
ఓ అమ్మడి తొలి రూపం
ఆకలంటే ఎరగని అన్యోన్యమైన నా జీవితంలో
స్రుష్టించావు ప్రేమ ఆకలిని
నిరీక్షణే లేని నిగాడ జీవితంలో
నిలువెల్లా కన్నులతో నిరీక్షిస్తున్నాను నీకోసం...

కళ



జీవమున్నదా ఆ కళలో
భావమున్నదా ఈ కళలో
కళ అంతరించక వెలగాలంటే
కళ కల్లగా మిగిలి పోకూడదంటే
ఆదరించాలి మనం ఆ కళని
అభిమానించాలి మనం ఆ కళాకారున్ని
నీవు నీలాగ బతకాలనుకుంటే
చూడు చూడొయి ఆ కళాకారున్ని
ఓ బాటసారీ అలా దారినే పోతూ
తీస్తున్నావు కూని రాగాన్ని
గళమెత్తి పాడు ఆ రాగాన్ని అదే
అన్నింటిని మించిన నీ అభిమాన గాన కళ
ఆ కళాకారున్ని చూడు
ఏదీ లేదూ అతని దగ్గర కానీ..
అపురూప కళా సంపద అతని సోత్తు అదే అతని ఎత్తు.

నా అన్వేషణా



అన్వేషించాను ఆ కొండ కోనల్లోనా
నా మది ఊహల రాగమేదనీ.. రాగ భావమేదనీ
సెలయేర్ల గట్టుదాటి పూవనాల తోటకేగి
చూచి చూచి అన్వేషించితిని నీ జాడనీ
మేలి ముసుగుల నీడలో పున్నమి వెన్నెల రాత్రిలో
ప్రేమదారల గానమిని అన్వేషించాను నా హ్రుదయంలో
అప్పుడు తెలిసిందీ...
నీ గుడి కోవెల నా హ్రుదయమని
ఆరాదిస్తున్నాను నా యద కోవెలలో కొలువైన ఆ దేవతను
వరమడుగుతున్నాను నా చిటికెన వ్రేలును పట్టి
చితి వరకూ తోడు రమ్మని

రామచిలక కోసం గోరింకనై



ఆనందమే పంచేటి ఈ పాడి పంటల్లాగ నా గానమిన్నావు
పూవుల చాటు తుమ్మెదలాగ సుధామ్రుతాన్నే పంచావు ఓ రామచిలక
నా బ్రతుకు సరిగమలను పండించడానికి వచ్చిన ఓ రామచిలక
ఆ కోన గుడి గంటల్లో మన పెళ్లి తారక మంత్రం
మనసులనే మరవగా నిన్ను
వలచి తలచి వచ్చిన
వలపు మాలనే నేను ఓ రామచిలకా...

నా మది భావం



నేను... ఉహ తెలిసినంత వరకూ
నా గొంతు విప్పి ఎరుగనూ
నిన్ను చూసాక తెలిసింది నా గొంతు
నానుకొని మనసుందీ ఆ
 మనస్సులో మదుర భావముందీ
దానికీ ఓ రూపముంది ఆ రూపము నువ్వే కాబోలు
అందుకే
నా మది భావాలను విప్పి
ఆలకిస్తున్నాను నీ ఎదుట నువ్వు
తిలకిస్తావనే ఆశతోనే
అందుకే ఓ ప్రియ నేస్తమా...
ప్రేమ అంటే
సినిమాలో పాడే డ్యూయెట్ అనుకున్నాను
కానీ కాదు అదు నిజమని ప్రేమంటే
సముద్రము లోని అలల లాగ
ఎప్పుడూ తీరం వైపు
గమ్యం వైపూ ప్రయాణించే ఒక
మదురు సుధా గానమనీ
తెలిసింది ఇప్పుడే ప్రేమంటే
చూపూ చూపూ కలిసాయి
సొగసు వగసుని చూసాయి ఇక
ఆ జంట కలవడమేననీ మిగిలినదీ
అనుకున్నాను కానీ
హూ...హూ... కాదు కాదు...
మనసులోని మూగ భావాలను
కనుల భాషతో వ్యక్తం చేస్తూ...
నీకు నే తోడూ నీడై వుంటానని
మనసులు చేసుకొనే రాజీ
ఫలితమే ప్రేమని తెలిసిందీ ఇప్పుడే....                  9.9.2001

ఏదీ నీది



ఈ ప్రక్రుతి మనోహరం ఎప్పుడూ నీ సొంతమా?
ఉహు... ఉహు... కాదు కాదు
నేడు నీ చెంతనున్నది
నిన్నెవరిదో... మెన్నున్నదో...
నేడు నీ పక్కనున్నది
రేపు ఎవరి పక్కో...
ఏదీ నీది...
నీవు తాగిన నీరే నీది కాదు
నీవు చూచినది నీకే కావాలన్నా తగునా...
యోచింపుము నేనన్న మాటలు
సత్యా సత్యములో తెలియును
అటు పిమ్మట రమ్ము నేనొసగుదును
నీకు బోద రావి చెట్టు బోదన
ఇవ్వాళ్ల నిన్ను రావోయి అని పిలిచినది
రేపు ఎవరి దగ్గరో...
నేడు నీ పక్కనున్నది
కాలక్రమమున ప్రక్కవాని ప్రక్కనుండు
అది తెలుసుకో.. తెలుసుకొని మసులుకో...   --- 07.11.2001

పరిమళ ఉగాది



పరిమళం నిండిన ఓ నవసంవత్సర ఉగాది
స్వాగతం సుస్వాగతం
నీవొచ్చిన వేళ నా ఇంట ఆనంద హేళ
కానీ
నీవుండేది నీవాడిపూల పరిమళాలుండేది ఒక్కరోజే
ఈ ఒకరోజు పరిమళాన్ని నా ముక్కు పుటాలలో ఎన్నిరోజులు బందించగలను
పూలు పూసాయి... ఈ లోకంలో మేమే అత్యదిక అద్రుష్టవంతులం
అని భావిస్తున్నాయి కాబోలు
కానీ
వాటి ఆనందాశ్రువులను జుర్రుమని పీల్చుకోవడానికి వస్తున్నది అదిగో ఆ అమ్మవారు
అమ్మవారు ఆ పూలను కోసినా... పాపం పిచ్చిపూలు
మేము అందరికన్నా మిన్నగల అందాల పుష్పాలం అందుకే మమ్ము తీసుకొని పోతున్నది
అని భావిస్తున్నాయి కాబోలు..
కానీ
అలా కాదని ఎవరు చెప్తారు వాటికి
పరిమళం వున్నంత వరకూ వాడుకొని
వాడిపోగానే వదిలేస్తారు అని ఎవరు చెప్తారు దానికి
అదీ ఇంట్లో కాదు మురికి కాలవ పక్కనున్న చెత్త కుటీరంలో
పాపం
పరిమళానికి ఏమి తెలుసు తను అనంత వాయువులలో మిళిత మైనానని.                2001 ఉగాది

మానవత్వం



మనిషి మనసుకోసం మనిషినే ఎరగా వాడుతున్న ఈ రోజుల్లో
మానవత్వం అనే పదం అంతరించి పోలేదంటావా
మనుషుల నుండి నేర్చుకోవలసిన మూగ
జీవులైన పశువులు
మనిషిలోని వైఖరిని చూసి నవ్వుకుంటాయంటావా
మానవత్వం అనే ముసుగు వేసుకొని
మనిషి జీవంను దేహంలో నిలుపుకొన్నా
అంతరాత్మను ఏవిదంగా రాజీ కుదుర్చుకోగలడు.      `         ---23.08.2001

చిరుదివ్వె నా ప్రేయసి

చిరుదివ్వె నా ప్రేయసి
మినుకు మినుకు మంటున్న గుడ్డి
చీకటిలో కూర్చుని కరుణకోసం
కన్నులు చాస్తుండగా
చిరుదివ్వెలా వచ్చావు గుండెలోకి
గాఢ చీకటిని పంపావు అడవిలోకి
అడుగీడుతున్నప్పుడే అనుకున్నా
ఏమిటీ శభ్దము అని
శరణుజొచ్చిన కన్యకవై అభయమిచ్చి ఆదరించవా
నీ తియ్యని మాటలతో నింపావు
నా యదగదిని
కానీ
పరవశంతో చెప్పలేకున్నాను నా మది బావాన్ని                           ---09.08.2001

29, మార్చి 2020, ఆదివారం

పరిశ్రమ



ఓ నేస్తమా తొందర పడకు
గాలిలో వున్న భందాలను చూసి
ఓ ప్రియతమా కలవరపడకు
అద్దాల మేడ అలాగే ఉండదులే
ఓ బందమా వీడిపోకు
నీలాగే ద్రుడమైనది కాదులే
ఐక్యమా ఆనందించకు
మద్యవర్థిత్వం మాణిక్యం కాదులే
కూలిపోతున్నదని భాదపడకు
కార్మికుని కన్నీటికి రాలిన బొట్టేలే అది                 04.08.2001

వృక్షం



నీరుపోసేది నేనూ
నీడిచ్చేది నువ్వా...
కటికరాయి విసిరేది నేనూ
కమ్మని ఫలమిచ్చేది నువ్వా
కవిత్వము రాసేది నేను
కరములతో తడిమేది నువ్వా
ఫలమునిస్తున్నావు ఫలితమేమున్నది
సాదువులా వున్నావు సాద్యమెట్లైనది
నడువలేకున్నావు నష్ఠమేమున్నది
నడిచి నే సాదించేదేమున్నది.                          25.06.2001

జీవనమే ఒక నాటకరంగం


జీవనమే ఒక నాటకరంగం
జీవితమే మరు ప్రేమ సొరంగం
మానవుడే ఒక మల్లెల పుష్పం
ప్రేమికుడే ఒక మకరానుభందం
చెలితో క్షణికానుబందం వద్దు
చరమాంకం వుండేదే ముద్దు
మరుపురానిదే మనసైనది
పరవరానిదే యద అన్నది
చెప్పలేనిదే ప్రేమన్నది
చూడరానిదే మనసన్నది
కరుణ అన్నదే కన్నులున్నది.      `---24.06.2001

మౌనమైన ప్రేమ

మౌనమైన మనసులో మాటలెట్లా పుట్టాయో
మనసేలేని చెలితో మాటలెట్లా చెప్పేదో
మరవరాని వేదనతో బ్రతుకు ఎట్లా గడిపేదో
మదిలోని భావాలకు అర్థమెట్లా చెప్పేదో
మరుమల్లి లాంటి మనసును మట్టిలో ఎట్లా కలిపేదో
మంచి గందం పూవు చుట్టూ పాములెట్లా తిరుగుతాయో
మనసున్న లోకంలో మమతెట్లా కరవైందో
ప్రేమతో పిలిచినా పలుకని ప్రియురాలితో
గుండెలో దాగున్న భావాలను చెప్పేదెలా
మనసిచ్చి ఆరాదించే దేవతను
నా గుండె కోవెల్లో కొలువుంచే దెలా            --- 18.05.2001