14, జూన్ 2021, సోమవారం

గురువు బిక్ష

 

పద్మవ్యూహమైన ప్రపంచంలోకి

అమ్మగర్బంలోంచి అభిమన్యుడి అంశతో భయల్దేరానూ....

ఏది మంచో... ఏది చెడో...

ఏది ఒప్పో... ఏది తప్పో....

ఏం చేయాలో... ఏం చేయకూడదో....

తెలియకుండానే ప్రయాణం సాగేదేమో....

కానీ

నాకొక మార్గదర్శనం దొరికింది

నాదారి పోడువునా చీకట్లను పారద్రోలే కాంతి ఫుంజం మెరిసింది

అప్పుడే విచ్చుకున్న నా కళ్లకు

ఉదయకాంతిని చూపించే  చదువుల భానుడు ఎదురొచ్చాడు

గురువు దొరికాడు

గురుతర భాధ్యతల్ని తను తీసుకొని నన్ను మలిచాడు

గతి తప్పని ఆలోచనలని

వక్ర మార్గమెరగని ఆచరణని

సమాజంలో నా సుస్థిరతని

తానే స్థిర పరిచాడు

ఆదిప్రణవమైన అ ఆ...లు మెదలు

అనంతమైన సంగతులు బోదించాడు

రూపంలేని నా స్వరూపానికి

శిల్పిలా...కుంచెలా....పాళిలా...

కమ్మరి కొలిమిలా... కుమ్మరి చక్రంలా... చేనేత రాట్నంలా...

నన్ను తీర్చిదిద్దాడు....

అభిమన్యుడి అసంపూర్తి నుండి

పార్థుని పరిపూర్ణం వరకూ

పద్మవ్యూహం చేదించి భ్రతుకు బండిని సాగించే వరకూ..

గురువుల బిక్ష నా ఈ కక్ష్య

గురువుల బిక్ష నాలో ప్రజ్ణ

గురువుల బిక్ష నేనే ఇంకా.....

గురుదేవోభవ, ఆచార్యదేవోభవ

అమరత్వదేవోభవ ఆచార్యదేవోభవ

ఇటు వైపు చూస్తోంది.

 

సార్వభౌమత్వం స్వాభిమానం

ఇవి జంటపదాలో... ద్విపదులో....

జాతి గర్హాలో... గర్వాలో... గర్జనలో....

నేడివి చర్చనీయాంశాలు... చైతన్య ప్రవాహాలు...

విశ్వమానవ కళ్యాణానికి

విశ్వగురూ వికాసానికి

విశ్వ వైప్లవ్య ప్రభోదానికి

విశ్వజనీన అంశీభూతం నా దేశం

అందుకే....

విశ్వమంతా నా దేశం వైపు చూస్తుంది

కరోనాసుర అంతం కోసం కంటైనర్లలో తరలొస్తున్న వ్యాక్సిన్ బుడ్డీల కోసం

విశ్వమంతా నా దేశం వైపు చూస్తుంది

దేహాలనే కర్షక క్షేత్రాలుగా చేసి హలాలనొదిలి రాజదాని గుడారాల్లో చేరిన రైతు న్యాయాల కోసం

విశ్వమంతా నా దేశం వైపు చూస్తుంది

ఆరుగాలం అన్యాయాన్ని ఆపమని నినదిస్తుంటే నిద్దరోయిన సెలబ్రిటీ పట్టు పరుపుల కోసం

విశ్వమంతా నాదేశం వైపు చూస్తుంది

విశ్వమానవుడి స్పందనలపై అఘమేఘాలై విరుచుకుపడుతున్న స్వార్వబౌమ సింహాల కోసం

విశ్వమంతా...

నాదేశం వైపు చూస్తుంది

నాదేహం వైపు చూస్తుంది

నా మోసం వైపు చూస్తుంది

నా కంచెల వైపు చూస్తుంది

నా కట్టుబాట్లని చూస్తుంది

నాపై కమ్మిన ఉగ్రవాదం వైపు చూస్తుంది

నాపై వేసిన అభాండాలను వింటుంది

నేనే లేకుండా చేసే కుట్రకోణాల్ని కంటుంది

స్వాభిమానమో.... సార్వభౌమత్వమో...

నన్నే లేకుండా చేస్తానంటే....

నా ఉనికినే ప్రశ్నిస్తుంటే....

నా నరాల్లో రక్తపు దారులకు నరమేదాన్ని అంటించాలనుకుంటే...

నా పొలాల్లో పారే నీళ్లకు కార్పోరేట్ సాంద్రతను చేకూరుస్తుంటే....

అసంఘటిత రంగమే కదా....

అడిగే వాడెవడనుకుంటే...

గడ్డిపరకలు ఒక్క చోట చేరి పురితాళ్లను పేనుతున్నాయ్

చలి చీమలు దారిని వెతుక్కుంటూ దడిలా గడీని కడుతున్నాయ్

అది ఉరితాడు కావాలో.... జంద్యమే కావాలో...

సమాదులే కావాలో.... కోటలా మారాలో....

తేల్చుకోవాల్సింది మీరే

మీరంటే కీడు చట్టాలు చేసే పాలకవర్గాలే కాదు

అన్యాయం వికటాట్టహాసం చేస్తున్నప్పుడు

నోరుమూసుకున్న నయవంచకులు

అబాగ్యుని ఏకాకిని చేసేందుకు

దండుకట్టిన దగుల్బాజీలు

మన బిడ్డలే కదా.... ఇకనైనా స్పందిద్దాం

ముళ్లకంచెలతో కాదు మనసు చంచలంతో ఆదరిద్దాం

నష్టనివారణకోసంకాదు నలుపు మచ్చ రాకుండా చూద్దాం

జై కిషాన్ జై హిందుస్థాన్.

 

2, జూన్ 2021, బుధవారం

మీడియానా మాఫియానా.....


కరోనా కరాళకేళి, అరణ్యరోదన, మ్రుత్యు విహారం, మరణ మ్రుదంగం ఏంటీ రాతలు, ఎవరికోసం ఈ కూతలు. ఫోర్త్ ఎస్టేట్ అని సగర్వంగా చెప్పుకుంటూ రొమ్ములు విరుచుకుంటున్న జర్నలిస్టులు సమాదానం చెప్పాలి. ఆక్సీజన్ దొరక్క అల్లాడిపోతున్న ప్రాణాల్ని ప్రపంచానికి చూపాల్సిందే కానీ ఎలా.... అసలే భయపడి రోగం రాకున్నా... రోగం లేదన్నా మీరు చెప్పే మాటలు చూపే ద్రుశ్యాలు చూసి ఇంట్లోనే కుప్పకూలుతున్న మనుషులపట్ల మీ భాద్యత ఏంటి? సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేసే వార్తల పట్ల జర్నలిజం తీసుకోవాల్సిన భాద్యత ఏంటో కనీసం ఒక్కటంటే ఒక్క ఛానల్ కైనా తెలుసా...? ఒక్క జర్నలిస్టు పాటిస్తున్నాడా...? ఏ విలువల వైపు మన మిడియా ప్రస్థానం కొనసాగుతుంది. ఓ వైపు పారసిటామాల్ బిల్లలు, విటమిన్ టాబ్లెట్లకు తోడు చాలా మైల్డ్ స్టెరాయిడ్ డ్రగ్స్ తో పరిష్కారమై పోయే సమస్యకు ప్రైవేటు హాస్పిటళ్లు నిలువుదోపిడి చేస్తుంటే... మీ వాలకం వాల్లకు మరిన్ని బేరాలు అప్పజెప్పినట్టనిపించడం లేదా? కేవలం భయం మాత్రమే ఎనబైశాతం చావులకు కారణమౌతుందని డాక్టర్లు గగ్గోలు పెడుతుంటే మీ చెవులకు వినిపించడం లేదా...? ధైర్యం చెప్పాల్సిన కష్ట సమయంలో ఈ పైశాచిక ఆనందం ఏంటి...? దయచేసి అదేపనిగా కరోనా వార్తల కంపుని జనం మీదకు వదలకండి....
సోషల్ మిడియా చేతులుంది కదా అని ప్రతీ అడ్డమైన సమాచారాన్ని షేర్ చేసి షేర్షాల్లాగా విర్రవీగుతున్న మిడిమిడి జ్ణానవంతులు కొంచెం సయమనం పాటించండి, ఎక్కడో ఏదో జరిగిందని, ఎవడో ఏదో పోస్ట్ చేయగానే నేనే ముందు అందించాలనే మీ ఆత్రాన్ని కొంచెం ఆపుకొని మీ మైండ్ లోని మలిన మూత్రాన్ని దించేయండి. ఎంబిబిఎస్, ఎండీలు కన్నా గొప్ప చదువుల మేదావులమని మీకు తోచిందేదో చెప్పి... అమ్మో అలా ఉందా... అయితే కష్టం, ఏంటీ ఇంకా ఇంట్లోనే ఉన్నావా... ఇక పోతావు, అంటూ మీ సొంత పైత్యంతో పేషంట్లకు పిచ్చెక్కనీయకండి. అలాగే ఏదైనా ఇబ్బంది ఎదురైతే కంగారు పడకండి. ముందు మీ టీవీని, ఫోన్ని తీసి పక్కన పెట్టండి. ఓ వెయ్యో రెండువేలో పోతే నష్టమేం లేదు, ఓ డాక్టర్ని సంప్రదించండి, అంతేకానీ అడ్డమైన ప్రతీ మెసిజీని, ఇచ్చే ప్రతీ వ్యక్తినీ నమ్మకండి. పీకలమీదికొచ్చాక నిద్రలేచి శ్మశానంలో చోటు వెతుక్కోకండి. ఇక ఈ టైంలో కేంద్రమేం చేసింది. రాష్ట్రమేం చేసింది అని సొల్లుపురాణాలు చెపుతూ తమ కన్నింగుని భయటపెట్టే ప్రతీ ఒక్కరికి ఎవరేం చేశారో తెలిసే రోజొస్తుంది అప్పటిదాకా ఎవడు చెప్పినా మీ సిద్దాంతాల వేదాంతం ఆపరని తెలుసు, వస్తుంది ఖచ్చితంగా వస్తుంది బెడ్డు మీద పడుకొని తీరిగ్గా ఎవరేం చేశారో తెలుసుకొని రాయండి, అప్పటికీ మీరు బతికుంటే......
వైద్యో నారాయణో హరీ అంటూ అసేతు హిమాచలం సాష్టాంగ పడుతున్న వేల, ఏం మనుషుల్రా మీరు, సంపాదనతో ఏం చేసుకుంటార్రా మీరు... 100 రూపాయల థర్మామీటర్ 1000, 500ల ఫల్స్ ఆక్సీమీటర్ 5000, విక్స్ బిల్ల దగ్గర్నుండి విటమిన్ బిల్ల వరకూ ఏం రేట్లురా అవి, ఎవనీకి తెలువని మందులైన రెమిడెసివీర్లు, టుసిలిజుమాబ్లు మీరు చేసే బ్లాక్ దందాల వల్ల ఇవ్వాల ప్రతీ ఒక్కనికీ ఉఛ్చ పోయిస్తున్నాయి. అయ్యా ఈ హౌలే గాళ్లకు చదువుకున్న మీరెట్ల జతకలిసిండ్రయ్యా... ప్రైవేట్ హాస్పిటళ్ల నిర్వాహకులారా ఏం దోపిడి ఇది వారం రోజుల విటమిన్ బిల్లల ట్రీట్మెంట్కి 10 లక్షల బిల్లులేంట్రా సామి, కత్తి పట్టిందీ లేదు, ఒక్కన్ని చీరిందీ లేదు, ఏం చేస్తున్నార్రా మీరంతా.... అవసరం ఉన్నా లేకున్నా ఆక్సీజన్ పెట్టాలె, వెంటలేటరెక్కియ్యాలే, రెమిడిసివీర్లు తెవాలని ముందే చెప్పాలె, అడ్వాన్స్ గా లక్షలు లక్షలు కట్టమనాలే, ఏంది సామీ ఇది మీ వల్ల ప్రాణాల్ని ఫణంగా పెట్టి పోరాడుతున్న డాక్టర్లకు చెడ్డ పేరోస్తుందిరా సామి. ఈ కరోనా పురుగుకన్నా భయానకమైన పురుగు ఖచ్చితంగా మిమ్మల్ని ఫడుతుందని మీ హాస్పిటల్ బయట ఏడుస్తున్న పేషంట్ల బందువుల ఉసురు మీకు తగలదా...
అయ్యా అన్నింటిని అవకాశాలుగా చూసి చూసి ఆకరికి ఇక్కడికొచ్చి పడ్డాము, ప్రక్రుతిని కుళ్ల బొడిచి పొడిచి ఈ విక్రుతిని కొనితెచ్చుకున్నాము. దయచేసి ఇకనైనా మారండి, ఇప్పుడైనా కళ్లు తెరవండి. మనుషులు అంటే మానవత్వం ఉన్నవాళ్లని గుర్తించుకోండి

 జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ

ఈ నినాదమే మా సమరనాదం
ఈ నినాదమే మా స్వాతంత్ర్యగీతం
ఈ నినాదమే మా స్వేచ్చా సంతకం
పరాయి పాలన మాకొద్దని ఢిల్లీని కదిలించిన మల్లయోదులం
పాలకులు, పాలితులు రెండు కులాల జాడలే నిజమని తెలిసిన కర్మయోగులం
కఠిన పాషాణాలనూ కరిగించిన ఉద్యమ ధీరులం
ఎప్పటికీ తెలంగాణోల్లం
అందుకే జై తెలంగాణే మా ఏకైక నాధం
నిర్జీవమైనా, సజీవమైనా నాప్రతీ అణువణువులో జీర్ణించుకున్న ఉద్యమ శ్వాస
అరవై ఏళ్లుగా అరిగోసలు పడి కాపాడుకున్న నిప్పుల కుంపటి
ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ అనుఫానుల్లో పెనవేసుకున్న ప్రశ్నల ఫరంఫర
అణిచివేతను సహించని దిక్కార స్వరం
అప్యాయతలు అల్లుకున్న కమ్మని మెరటు తనం
ఇది నా మట్టి, ఇది నా గాలి
ఇది నా ఇళ్లు, ఇదే నా నైజం
దేహంపై కర్మజలం చల్లి నా తల్లి భూగర్బంలో తలదాచుకొనే చోటిది
నా నైజం మారదు, నా ప్రశ్న ఆగదు
మార్పు మనుగడకే కాని మనో: గడకు కాదు
అప్పటిది, ఇప్పటిది, ఎప్పటిది
జై తెలంగాణ మెక్కటే
అందుకే.... సోదరా....
జై తెలంగాణ, జై తెలంగాణ, జైజై తెలంగాణ.
ఎనిమిదవ తొలకరిలోకి అడుగుపెడుతున్న
నా తెలంగాణకు అబినందనలు, నా సోదరీ సోదరులకు శుభాకాంక్షలు.