5, అక్టోబర్ 2015, సోమవారం

atmahatyalu vaddu

ఒక ఎడారి పువ్వు మెరువాలా వద్దా అని క్షణక్షణం తటపటాయిస్తుంది
ఒక నిర్జనమైన నవ్వు అప్రతిహాతంగా వెక్కిరిస్తూనే ఉంది

ఏంటో కాలం గడిచి మంచి జ్జ్నాపకానికి ఊపిరిపోస్తుందనుకొంటే
యవ్వనం మెరిసి మరో లోకానికి గొనిపోతుందనుకుంటే
రాజ్యం రాబందేనని,మోక్షం మొగిలి పువ్వేనని
కష్టాల కడలిలో పడిలేచినా
ఈ నష్టాలని బరించలేక
కరుకుడెక్కల రాబందులు నీకోసం ఎదురుచూస్తున్నాయని
ఎందుకుపోయావు రైతన్నా, మా బండిని లాగే దైర్యం ఏమైంది రైతన్నా...

వద్దు వద్దు వద్దు నీ చావు
అసలే వద్దూ, ఎదురుచూపు మనకి కొత్తేం కాదు
మనం కన్న స్వప్నాన్ని ముద్దాడేందుకు అరవై ఏళ్లు చూచాం
ఇంకో మూడేళ్లలో మన కొరడా ఝులుం విదుల్చుదాం. అన్నా రైతన్నా
వద్దు వద్దు వద్దు నీ చావు
అసలే వద్దూ...

సుధీర్‌ గంగాడి