21, డిసెంబర్ 2018, శుక్రవారం

traffic song


ప్రేయసీ ప్రియులు విడివిడిగా ముఖ్యమైన పనిమీద వెళ్తుంటారు కానీ ట్రాఫిక్ గజిబిజిలో చిక్కుకుపోయి టైం వేస్టవుతున్నప్పుడు వచ్చే పాట.

పల్లవి
రయ్యిరయ్యిన దూసుకెళ్లే మోటార్ బండి జామయ్యే
గల్లి గల్లిన ఆగిన బండ్ల ఘల్లు ఘల్లు షురువాయే
కారులోపల స్టీరియోల గోల గోల
ఎండ మిలమిల చక్కెరొచ్చి తిరగాలా
చిక్కులురా ట్రాఫిక్ తిప్పలురా బాగ్యనగరి బతుకికి బాటలురా.....

చరణం1
గుసగుస ముచ్చట్లో సరసాల సైరన్లు
ఊపిరాడని ముసుగుల్లో నిట్టూర్పు సరిగమలు
పాటల ఎఫ్ ఎంలో తిక్కతిక్క సొల్లు మాటలూ
ఇయర్ పోన్లల్లో మోతెక్కే సౌండ్ పాటలూ
నడుముల వంపుల్లో నొప్పుల పులకరింతలూ
నయనాలు నాసికల్లో నల్లని పొగమేఘాలూ
అబ్బా బతుకేమోగానీ బస్టాండయ్యిందే

చరణం2
సంస్కారపు పిడివాదం కార్లో ఏక పాదం
ఆకారన అత్యద్బుతం చీమల బారంతైన లేదు ఇగురం
ఆర్థికపు ఆరాటం కాల్చేదేమో పరాయి ఇందనం
మెహాన అలంకారం రొడ్డుకేమో జూగుప్ప లాలాజలం
సందులో చిలకొట్టడం పరిపరిగా లొల్లిపెడదాం
ఎకిలీ చూపులతో అమ్మాయిని ఆవురంటు తినేస్తాం
చిన్నకు పెద్దకు తేడాలేదు బరబాసు బతుకైందే


20, డిసెంబర్ 2018, గురువారం

sad song female


చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ప్రేమికుల ప్రేమని అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడమే కాక ఒకవేళ నువు అతన్నే కావాలని కోరుకుంటే వెళ్లొచ్చు కానీ మేం ఖచ్చితంగా చచ్చిపోతాం అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినపుడు ఆ అమ్మాయి అబ్బాయితో బ్రేకప్ చేసుకొని వెళ్లిపోయినప్పుడు వచ్చే పాట
సోలో.....
పల్లవి
వెలిపోయే శ్వాస, మిగలని ఆశలో
వెలుగంతా మాయమై కమ్మేసే నిశిదిలో......
ఆయువునే ఇచ్చిందొక బందం
ఆశలతో అల్లెను తన బందం
ఏ దారీ తెలియకా ఏ వైపో పోతున్నా...
నిశి రాత్రీ ఘడియలో  నిప్పుల పిడుగులో........

చరణం1
బుడి బుడి అడుగుల్లో నడకకి ఆదారం
నిజమయ్యే ఊహలకీ అదే పెను ఘాతం
తోడున్న గమనంలో నీడైన దరహాసం
జంట పయనాన పడగై విష కాలం
కాదంటే కరుగునా నిన్నటి మమకారం
నీడల్లే వదులునా పేగిచ్చిన బందం
చరణం2
ఊహల రేపటిలో తనువులో సగబాగం
ఊరేగే యదలో తనే లయ నాదం
రేపటి కిరణమై వెలగాల్సిన చోట
మరణాలు చరణాలై తనువుని చాలిస్తే
ప్రణయాలే ప్రళయాలై ప్రమాదంలో పడితే
బతికుండీ వదులునా ప్రేమల కారుణ్యం...

19, డిసెంబర్ 2018, బుధవారం

sad song male


గాడంగా ప్రేమిస్తున్న అమ్మాయి అనుకోని సంఘటనలో చూసి తన ప్రియున్నొక మోసగానిగా భావించి ప్రేమని వ్యక్తపరుద్దామనుకొని వచ్చి అసహ్యించుకొని వెళ్లిపోయిన తర్వాత తనని కన్విన్స్ చేస్తూ ప్రేమికుడు పాడే పాట...
చివరలో అమ్మాయి తప్పుతెలుసుకొని మళ్లీ కలుసుకోవడం రావాలి.

పల్లవి.
మరి మరి చెప్తున్నా నా మనసే తెరుస్తున్నా
కనులైనా కలనైనా నువ్వే నా హ్రుదయపు మంత్రం
నీతోనే నా సంతోషం, చూసిందంతా చూపుది కాదే
చెపుతున్నానే నా వలపు కథనాన్నే
చరణం1
అబద్దాల గజిబిజి తనమది
అంతులేని నిజమేదో కనమని
నమ్మకమే తప్పక గెలుచునె
నేనన్నది నువ్వయ్యానని నీలోని నన్నే అడిగే.....
నీకోసం తపించె మనసే తప్పన్నది చేయని తనమే............
చరణం2
ఏడేడు జన్మలదాకా ఎగిసిన బందమిది తెలుసా
శ్వాసించే ఆయువు చివరన నిలుచున్నది నీవే చెలియా
మరణించే ఘడియ దాకా మనసన్నది నీదే సఖియా
చెదిరిపోని కలలకి రూపం రమ్యమైన మన జీవన యానం
వస్తా నేనొస్తా నీ ప్రాణాపు కొమ్మకి పువై మెరుస్తూ....
ఉంటా కొలువుంటా నీ వలపుల పంటలో దాన్యపు రాశినై...........