21, డిసెంబర్ 2018, శుక్రవారం

traffic song


ప్రేయసీ ప్రియులు విడివిడిగా ముఖ్యమైన పనిమీద వెళ్తుంటారు కానీ ట్రాఫిక్ గజిబిజిలో చిక్కుకుపోయి టైం వేస్టవుతున్నప్పుడు వచ్చే పాట.

పల్లవి
రయ్యిరయ్యిన దూసుకెళ్లే మోటార్ బండి జామయ్యే
గల్లి గల్లిన ఆగిన బండ్ల ఘల్లు ఘల్లు షురువాయే
కారులోపల స్టీరియోల గోల గోల
ఎండ మిలమిల చక్కెరొచ్చి తిరగాలా
చిక్కులురా ట్రాఫిక్ తిప్పలురా బాగ్యనగరి బతుకికి బాటలురా.....

చరణం1
గుసగుస ముచ్చట్లో సరసాల సైరన్లు
ఊపిరాడని ముసుగుల్లో నిట్టూర్పు సరిగమలు
పాటల ఎఫ్ ఎంలో తిక్కతిక్క సొల్లు మాటలూ
ఇయర్ పోన్లల్లో మోతెక్కే సౌండ్ పాటలూ
నడుముల వంపుల్లో నొప్పుల పులకరింతలూ
నయనాలు నాసికల్లో నల్లని పొగమేఘాలూ
అబ్బా బతుకేమోగానీ బస్టాండయ్యిందే

చరణం2
సంస్కారపు పిడివాదం కార్లో ఏక పాదం
ఆకారన అత్యద్బుతం చీమల బారంతైన లేదు ఇగురం
ఆర్థికపు ఆరాటం కాల్చేదేమో పరాయి ఇందనం
మెహాన అలంకారం రొడ్డుకేమో జూగుప్ప లాలాజలం
సందులో చిలకొట్టడం పరిపరిగా లొల్లిపెడదాం
ఎకిలీ చూపులతో అమ్మాయిని ఆవురంటు తినేస్తాం
చిన్నకు పెద్దకు తేడాలేదు బరబాసు బతుకైందే


20, డిసెంబర్ 2018, గురువారం

sad song female


చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ప్రేమికుల ప్రేమని అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడమే కాక ఒకవేళ నువు అతన్నే కావాలని కోరుకుంటే వెళ్లొచ్చు కానీ మేం ఖచ్చితంగా చచ్చిపోతాం అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినపుడు ఆ అమ్మాయి అబ్బాయితో బ్రేకప్ చేసుకొని వెళ్లిపోయినప్పుడు వచ్చే పాట
సోలో.....
పల్లవి
వెలిపోయే శ్వాస, మిగలని ఆశలో
వెలుగంతా మాయమై కమ్మేసే నిశిదిలో......
ఆయువునే ఇచ్చిందొక బందం
ఆశలతో అల్లెను తన బందం
ఏ దారీ తెలియకా ఏ వైపో పోతున్నా...
నిశి రాత్రీ ఘడియలో  నిప్పుల పిడుగులో........

చరణం1
బుడి బుడి అడుగుల్లో నడకకి ఆదారం
నిజమయ్యే ఊహలకీ అదే పెను ఘాతం
తోడున్న గమనంలో నీడైన దరహాసం
జంట పయనాన పడగై విష కాలం
కాదంటే కరుగునా నిన్నటి మమకారం
నీడల్లే వదులునా పేగిచ్చిన బందం
చరణం2
ఊహల రేపటిలో తనువులో సగబాగం
ఊరేగే యదలో తనే లయ నాదం
రేపటి కిరణమై వెలగాల్సిన చోట
మరణాలు చరణాలై తనువుని చాలిస్తే
ప్రణయాలే ప్రళయాలై ప్రమాదంలో పడితే
బతికుండీ వదులునా ప్రేమల కారుణ్యం...

19, డిసెంబర్ 2018, బుధవారం

sad song male


గాడంగా ప్రేమిస్తున్న అమ్మాయి అనుకోని సంఘటనలో చూసి తన ప్రియున్నొక మోసగానిగా భావించి ప్రేమని వ్యక్తపరుద్దామనుకొని వచ్చి అసహ్యించుకొని వెళ్లిపోయిన తర్వాత తనని కన్విన్స్ చేస్తూ ప్రేమికుడు పాడే పాట...
చివరలో అమ్మాయి తప్పుతెలుసుకొని మళ్లీ కలుసుకోవడం రావాలి.

పల్లవి.
మరి మరి చెప్తున్నా నా మనసే తెరుస్తున్నా
కనులైనా కలనైనా నువ్వే నా హ్రుదయపు మంత్రం
నీతోనే నా సంతోషం, చూసిందంతా చూపుది కాదే
చెపుతున్నానే నా వలపు కథనాన్నే
చరణం1
అబద్దాల గజిబిజి తనమది
అంతులేని నిజమేదో కనమని
నమ్మకమే తప్పక గెలుచునె
నేనన్నది నువ్వయ్యానని నీలోని నన్నే అడిగే.....
నీకోసం తపించె మనసే తప్పన్నది చేయని తనమే............
చరణం2
ఏడేడు జన్మలదాకా ఎగిసిన బందమిది తెలుసా
శ్వాసించే ఆయువు చివరన నిలుచున్నది నీవే చెలియా
మరణించే ఘడియ దాకా మనసన్నది నీదే సఖియా
చెదిరిపోని కలలకి రూపం రమ్యమైన మన జీవన యానం
వస్తా నేనొస్తా నీ ప్రాణాపు కొమ్మకి పువై మెరుస్తూ....
ఉంటా కొలువుంటా నీ వలపుల పంటలో దాన్యపు రాశినై...........


8, అక్టోబర్ 2018, సోమవారం

రాజ్యం వీరబోజ్యం రైతుల్ని వేదించే సమాఖ్య సూత్రం


ఇది రాజ్యం
రాజ్యాంగ రక్షణలతో కూడిన రాజ్యం
రాజ్యమే రాబందులా మారిన రామరాజ్యం
సబ్కో సన్మతి తెలిపిన మహాత్ముని బాట మరిచిన బోజ్యం
లక్షల కోట్ల కార్పోరేట్ల కుఠిల నీతి దారిలో సాగే వసుదైక సౌమ్యం
నా ప్రజాస్వామ్యం

ఇది బోజ్యం
బోషాణాల సంపదనెల్లా బడా దొరల బొక్కసాల నింపే బోజ్యం
బ్రతుకు తెరువుల బక్క ప్రాణాలని గడ్డిపోచల్లా తీనేసే బోజ్యం
దరలులేక, ఆదరణ లేక అడుగంటిపోతున్న సేద్యంతో
కరెంటివ్వక, నీరులేక ఓవైపు రైతన్న నీరుకారిపోతున్నా
శాంతియుత నిరసనలపై గ్యాలన్ల కొద్ది క్యానన్లని విసిరే రాజ్యం
అందుకే
రాజ్యం వీరబోజ్యం

రోజుకి మూడువందల కోట్లు సంపాదించే బీదల కోసం రాజ్యం కానీ
28 రూపాయలు ఖర్చుపెట్టే నవాబుకి ఇంకేం చేస్తాం
ఖార్ఖాణాల రీపైనరీలు ముఖ్యం కానీ
గోడ్డు గోదతో మట్టిని నమ్ముకొనే రైతుకి ఇంకేం చేస్తాం
పరమ పవిత్ర రాజ్యాంగమిది, రాజ్యమిది
అందుకే
రాజ్యం వీరబోజ్యం

మేమిచ్చిన అదికారంతో
పంచెయ్ అంబానీకో అదానీకో...
దోచెయ్ రక్షణలో రాఫెల్లో....
చిదిమెయ్ అవకాశాల్నో ఆశల్నో....
తీసేయ్ గాందీనో గాందేయ వాదుల్నో....
చంపెయ్ రైతుల్నో రక్షకుల్నో....

4, అక్టోబర్ 2018, గురువారం

శ్రీశ్రీ వర్థంతి సందర్భంగా నివాళితరం తరం నిరంతరం
తెలుగుజాతికి నీవోక వరం
మాతరం, మనిషైన ప్రతీ ఒక్కరం
నీ కవితల కవనాల్లో 
ఆ నిట్టూర్పుల జ్వాలల్లో 
ఎగదోసే చైతన్యంలో
ఎరుక చెప్పే మాటల్లో
చిక్కిన వాళ్లమే
అక్షరం దిద్దిన ప్రతీ ఒక్కరం
అదే ఆయుదంగా మహాప్రస్థానాన్ని సాగించిన వాళ్లమే
మరో కొంపల్లి జనార్ధనరావుగా మారిన వాళ్లమే
చలం చూపిన దారిలో శ్రీరంగం దిద్దిన వాళ్లమే, శ్రీకారం చుట్టిన వాళ్లమే
అసలు మా అస్థిత్వానికి కారణం నువ్వు
గ్రాందిక భూగర్బాన్ని చీల్చి 
నుడికారాలని అర్తనాదాలు పెట్టించి
తెలుగుకి స్వేచ్చా వాయువుల్ని అందించింది నువ్వు
ఊహల్లో ఊరేగుతున్న నవయువకులని
భూమార్గం పట్టించింది నువ్వు
భూకంపం పుట్టించింది నువ్వు
భూనబోంతరాలు దద్దరిల్లేలా సింహనాదం చేసింది నువ్వు
చరిత్రలో కూలీలకి తావిచ్చింది నువ్వు
తడారిపోయిన మా గొంతుకలకి హలాహలంతో శబ్దాన్నందించింది నువ్వు
పురిటినొప్పుల తెలుంగుకి తెగువనందించింది నువ్వు
మహాకవీ మా మనసులో యశస్సులో
ఉషోదయంలా వెలిగొచ్చేది నువ్వు
మరో ప్రపంచాన్ని దాని ప్రళయఘోషని చూపించింది నువ్వు
నిస్సత్తువ ఆవహించిన మా నరాల్లో ఉడుకునెత్తురిని ఉరకలెత్తించింది నువ్వు
అందుకే 
ఈ శతాభ్దం నీది
కాదు కాదు 
తెలుగు బాష ఆద్యంతం నీది
మర మనుషుల జాడలు కదలాడుతున్న వేళ
స్వార్థాల సొంతాలు మితిమీరుతున్న నేల
నీదీ నాది కులం గోత్రం
పైశాచికంగా మారి ప్రహాసనం నడుపుతుంటే
పక్కనోడిని పట్టించుకోని
ప్రజా జీవితం పరిభ్రమిస్తుంటే
కాలకేళిలో రాజకీయం
కరుకు రెక్కల్ని విస్తరిస్తుంటే
బిక్కటిల్లి దిక్కుతోచక 
అన్యాయ పరిష్వంగనలో పీడితులు తాడీతులు చిక్కుకుపోతుంటే
పరాన్నజీవుల, జలగల 
విక్రుత క్రీడలు 
పామర జన సందోహంలో
పడమటి నీడలు
నేటి ఆవరణం ఇది
రణాన దూకాల్సిన రంగస్థలం ఇది
అందుకే ఇక్కడ నిలబడి నిన్ను ఆవాహనం చేస్తున్న
నువు కావాలి నువ్వే కావాలి
శ్రీ శ్రీ తిరిగిరా
మళ్లీరా
కొరడాతో మెద్దుబారిన మా చర్మాన్ని చీల్చేయ్
కలంతో కునారిల్లిన మా అంతరంగాన్ని కడిగెయ్
నిప్పులు చిమ్ముతూ 
ఘణఘణ మోగుతూ
నీ ఆగమనం సమస్త కోటికి ఆనందం.

కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు

ఓర్పుగా నేర్పుగా
ఒద్దికగా ఒక ఓరవడిలా దూసుకుపోయే నేటి తరానికి
నిజమైన నాయకుడివి నీవు
ఇసుమంతైనా అలసత్వం లేని
ఆకాశమంత ఆత్మవిశ్వాసం నిండి
తరతరాల పోరుతో త్రోవచూసుకుంటూ వచ్చిన సమూహానికి
ఎందరో మహనీయుల మార్గదర్శనానికి
నువు నిజమైన బాటసారివి
పరాయి పాశానాల్లో సైతం
హిమసీమల ఆనవాల్లు తీసి
దుర్బేద్య పురాలని సైతం
చమత్కారంగా గెలుచుకోగల
మాటల మాంత్రికునివి
ఆరోపనారోపణల పర్వం
అత్యంత సామాన్యమైన కలికాలానా
మహాత్మా గాందినే ప్రశ్నార్థకంగా చూసే కనులున్న కాలానా
పట్టనట్టుండడమో, పరీక్షకు నిలవడమో
రెండూ కత్తిమీద సామే
నీ ప్రాబవానికి దొరకని ప్రశ్నలైతే కావే
మా శ్వాసగా మెలుగు
మా విజయమై నవ్వు
మా పయనమై సాగు
కేటీఆర్, నీకిదే జన్మధిన శుభాకాంక్షలు.

ఇది నా స్పేస్ జయశంకరా

ఇది నా స్పేస్
నాకు ఇదొక్కటే కావాలి
తెలంగాణ బిడ్డలకి అన్యాయం జరుగుతుంది
తెలంగాణ దగాపడ్తుంది
మీరు చెప్పిన పాఠాలు విన్న బిడ్డలు
బెబ్బులులై ఉరికిన్రు
అనుక్షణం కంటికి రెప్పలా
ఉద్యమాన్ని కాచి
నిరుత్సాహం కల్గినప్పుడల్లా మార్గదర్శనం చేసి
పదవులు కాదు ఫలితం గావాలె
తెలంగాణ కల్లచూడాలే
ఇదే మీ ఎజెండా
ఆ స్పేసే ఇయ్యాల మాకింత బువ్వవెడ్తుంది
ఆ ఓర్పే మాకెప్పటికీ నడక గావాలె
జోహార్ అమరుడా
జయశంకరుడా

వాజ్ పేయికి నివాళి

కాలం కఫాలంపై చెరిగిపోని సంతకం చేసిన దీరుడా
భరతమాత నుదిటిపై సింధూరంలా మెరిసిన యోదుడా
ఈ ధర్మభూమిలో కర్మయోగిలా నీ పయనం సుస్థిరం
మార్మిక సత్యాల్ని మాటల్లో మంత్రాల్లా వల్లించి
నడకలో నడతలో నీ ప్రతీ ఉశ్వాస నిశ్వాసాల్లో
నిర్భయమైన న్యాయాన్ని
నిష్ఠూరమైన సత్యాన్ని బోదించి
నవ భారతానికి దిశానిర్ధేశం చేసిన అజాత శత్రువు నీవు
కవిత్వమంటే రాతలోనే కాక మాటలో నింపిన భావకుడివి నీవు
రాజకీయమంటే స్వలాభం కాదు జన జాగృతి చేతనమని చూపినవాడివి నీవు
పదవంటే లాలసలేదు, పదమూడుకు బయపడనే లేదు
సార్వబౌమ చిరునామానీవు, పెద్దన్నకి జడిసిందీ లేదు
ఆకాశమంత ఎత్తున్న నీ వ్యక్తిత్వంతో ఎప్పుడో అక్కడ నిలిచావు
ఇప్పుడు కొత్తగా పోయెదెక్కడికి
అటల్ జీ మా ఆత్మగౌరవ సూచివి నీవు
బేహారుల గుండెల్లో బిహారివి నీవు, గర్జించే మరఫిరంగీ నీ నవ్వు
వాజ్ పేయి ఇప్పుడు నీ అస్థికలు గర్జిస్తున్నాయి
భారత్ మాతాకీ జై అనీ
మా హ్రుదయం ఘటిస్తోంది భారత్ మాతాకీ జై అనీ

కెరళ విలయం

గర్జనా గర్జనల మేఘమాల
చాలింక నీ గద్దింపుల మరణహేళ
జలమే జీవనం
కఠినాత్మం కావడం అసంబద్ధం
నీ ప్రకోపంతో సృష్టించిన ఈ ప్రళయం
నీ ప్రశాంతంతో పరిడవిల్లాలి ఈ దినం
దేవభూమిని మరుభూమిగా మార్చిన నీ కాఠిన్యాన్ని కరిగించుకో
మానవ హననాన్ని సాగించిన నీ మలయ మారుతాన్ని మల్లించుకో
మామూలు మనుషులు వాల్లు
మలయాల తంబీలు వాల్లు
ఓ వరుణా నీ కరుణ కావాలిప్పుడు
ఓ మానవా నీ వితరణ చూపాలిప్పుడు
మదమెక్కిన మేఘం కన్నా
మానవతే మిన్నని చాటుదాం
కృంగిపోయిన బతుకుల్లోనా
మిణుగురులై వెలుగులు పంచుదాం

కాలన్న యాదిలో


కష్టించే బతకమన్నవ్
అన్యాయాన్నెదిరించమన్నవ్
ఆరాద్యుడెవడో తేల్చిచెప్పావ్
ఉద్యమమే ఊపిరన్నవ్
పోరాటాల దారి చూపావ్
నిత్య సంఘర్షణ
నిజానికై ఆపత్తన
నిజాముపై దండెత్తిన
నీ కరవాలానికి నమస్కారం
నీ కలానిది కాలాతీతం
కాలన్నా
నీ అక్షరం లక్ష మెదల్లని కదిలించింది
నీ మార్గదర్శనం తెలంగాణని సాధించింది
ఇప్పుడు
నీ బోధనలు చెవికెక్కాలి
ఏ పార్టీ వాడో కాదు ఏ పాటి వాడో చూడూ
చేసేది కాదూ చేసిందేంటో చూడూ
పెట్టుకొనే టోపీ కాదూ పెట్టిన టోపీ చూడూ
అలాగే
పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది
చెప్పినోడివి కాదూ బతికినోడివి నీవూ
కాలన్నా
మరోసారి పుట్టన్నా
మా మధ్యనే పుట్టన్నా
తెలంగానం చేద్దాం
అన్యాయన్నెదిరిద్దాం

కొండగట్టు ప్రమాదం

మళ్లొస్తా మరి....
నిజంగానే తిరిగిరాని లోకాలకి వెళ్తారని తెలియదెమో
బిడ్డలకి మంచి చెడులు చెప్పలేదు
తల్లిదండ్రులకి జాగ్రత్తలు చూపలేదు
అన్నలని, అక్కలని,తమ్ముల్లని,చెల్లెల్లని
ఇరుగు పొరుగుని ఎవ్వలనీ తెరిపార జూడలేదు
అఖరికి కొండగట్టు అంజన్ననీ ఆర్తిగా అడగలేదు
ఇంట్లో చెప్పనైతే చెప్పారు మళ్లొస్తా మరి
అంతల్నే మృత్యు దేవత తరిమేసింది
లోయలోకి తోసేసింది
తలరాతనా పాలకుల గీతనా
డొక్కుబస్సులు, కాసుల మూటలు
రోడ్ల గుంతలు, కాంట్రాక్టర్ల పనులు
తుప్పు బ్రేకులు, తుస్సుల టైరులు
డ్రైవర్ల కునుకులు, అధికార్ల ఆశలు
కారాణాలేవైతేనేం
కాలిపోయేది మేమే కదా
మెమంటే మనుషులమయ్యా
ఓటర్లే కాదు
కేవలం ఓటర్లే కాదు
లోకాన్ని చూడని పసిగుడ్డులం
బోసినవ్వులతో ఆడుకోవాలనే పండు ముసల్లం
కాయానికి కష్టాన్ని చేర్చే శ్రమజీవులం
రేపటిపై ఆశలతో నిలిచే మనుషులం
కేవలం మనుషులం
ఎక్స్.గ్రేషియాలు ఓదార్పులు కాదు
మళ్లొస్తా మరి అని చెప్పనీయండి
ఆ భరోసానియ్యండి
రోజుకొక ప్రమాదం మామూలే అని కాదు
మీ మామూల్ల మత్తు వదలండి
పోయేది ప్రాణమే
ఒక్కసారి నీ ఇంట్లో విషాదాన్ని యాజ్జేసుకోండి
పోయేది ప్రాణమే
ఒక్కసారి నీ ఆప్తుల చావు చూడండి
పోయేది ప్రాణమే
ఒక్కసారి బాదితుల రోదన వినండి
మమ్మల్ని కాపాడండి
మనం అంటే మనుషులం
ఓటర్లే కాదు
కేవలం ఓటర్లే కాదు
మళ్లొస్తా మరి అని చెప్పనీయండి
అయ్యే వెళ్లొస్తా అంటే
ఎందుకు పంపానా అని ఎడిపించకండి
దారులు రక్త పిపాసులై
ప్రాణాల్ని దోచేస్తుంటే
దైన్యంగా చూడడం తప్ప
దైర్యవచనాలు చెప్పడం తప్ప
ఇంకేమీ చేయలేని ఈ సామాన్యున్ని క్షమించండి
శాశ్వత నిద్రలో శాంతించండి......

చైతన్య ప్రకాశ్ కి అక్షర నివాళి

ఏమని చెప్పాలి
ప్రతీ శ్వాస చివరన మెలకెత్తే ఒక ఆశల వారది చివురించునని
ఎంతని చెప్పాలి
చైతన్యపు దారుల్లో అది చివురించుననీ
ఇది జీవితం ఇదే కదా జీవితం
ఇంతే కదూ జీవితం
విప్లవమే సత్యమని
విదూషక జీవితమిదని
‌సత్యాన్వేషణ తగదూ తగదిదని
చాటినా....
నమ్మేదెట్లా
నడిరేయి చీకట్లు
చుట్టుముట్టి పాతేస్తే పోయేదెట్లా
అయ్యే పోయితివెట్లా...,
ఇదీ జీవితం ఇదే కదూ జీవితం
ఇంతే కదా జీవితం....
పోతే సమాది ఔనా
పోయింది విలువలేనిదనా...
కాదూ కాదిది సత్యం
కానరాని వెలుగుల చైతన్యం
చూడరా ఆ సమాది కిరణం...
హెచ్చు తగ్గుల క్రీడ
సమాజ తప్పుల తక్కెడ
ఏనాడు సమాదౌనో
నాడే నా మరణం
అనాడే‌ నా జననం
అందాకా
ఏమని చెప్పాలి
ప్రతీ శ్వాస చివరన మెలకెత్తే ఒక ఆశల వారది
చివురించుననీ
ఇప్పటికిక సెలవూ
రేణ రాగాలిక షురువు
ఇప్పటికిక సెలవూ
చైతన్య ప్రకాశికల దరువూ
ఇప్పటికిక సెలవూ
పర్శయ్య నీ ఆవేదనల నెలవూ....

జన్మదిన శుభాకాంక్షలు


నువు చూపే వాత్సల్యం
నాకొక స్నేహాన్నిచ్చింది
నువ్విచ్చే దైర్యం
నాకొక భరోసానిచ్చింది
నువు చేసే సహాయం
నాకొక నడతని నేర్పింది
వంద పుస్తకాల సారం
నీ మంచి స్నేహంలో దొరికింది
వంద సంవత్సరాల కాలం
మన స్నేహ సుగందంతో నిండుతుంది
నేస్తం
సంవత్సరాలెన్ని కరిగినా
కరిగిపోని స్నేహ బందంతో చెప్తున్న....
జన్మదిన శుభాకాంక్షలు

నాలో నేనే జారిపోయాను

ఎందుకో నిన్ను చూసిన ప్రతీసారి నన్ను నేను మరిచిపోతాను
ఒద్దికగా నువు మాట్లాడిన ప్రతీసారి నాలో నేనే జారిపోతాను
నువు నవ్వితే నా పెదాలు విరబూస్తాయి
నువు నడిస్తే నా పాదాలు చలిస్తాయి
భావన నీదైనా అనుభూతిని మాత్రం నేనే
బాద ఏదైనా బతుకు మాత్రం నీతోనే

ఒక్కోసారి
రెప్ప వాల్చాలంటే బయమేస్తోంది
కమ్ముకొచ్చే నిద్రని నీ రూపం కబలిస్తుందని
ఎలా చేరానో తెలీదు ఎవరెస్టు అంచుకు
బహుషా నువ్విచ్చిన దైర్యమేమో అది
నువ్వున్నావనే గమనమేమో అది
నేలా నింగీ నిప్పూ
అన్నీ నన్ను చూసి ఈర్షపడుతున్నాయి
వాటినొదిలి నువు నా వద్దకొచ్చావని
పరాకులో ఏమరుపాటులో నైనా
నీ ద్యాసలో బతకడమే తెలుసు
ప్రపంచమంతా పాదాక్రాంతమైనా
నువ్వున్నప్పుడే నాది గెలుపు
నేనేం చెప్పినా నమ్మకు
నా మనసు చెప్పేదే వినూ
నేననేది మిగలకపోవచ్చు
నా ఆత్మ నిన్ను వదలకపోవచ్చు
నే కోరేది అదే
నీ దరే
అందుకే, నిన్ను చూసిన ప్రతీసారీ నన్ను నేను మర్చిపోతాను ప్రియా.........

తనలోనే నేనూ


నేనేమో తనూ
తనలోనే నేనూ
అద్భుతం ఈ ప్రయాణం
ఒక్కోసారి అనిపిస్తుంది
నువ్వు కలువకపోతే
నీ జతే కుదరకపోతే
తనలోనే నేనున్నప్పుడు
నాకోసం తను వేచి చూసేప్పుడు
ఇంకా ఈ ఊహెందుకు
కాదనే లేదనే ఊహలకే అస్కారం లేదు
చెలిమికి చెలియవు నీవు
చలించే హ్రుదయానివి నీవు
ఒక్కో వసంతం నీతో కలిసి గడిచిపోతుంటే
గడియలా జీవితం సాగినట్లుంది
కమ్మని కోయిలలా నీ గొంతు వింటుంటే
మామిడి పూతలా వర్ణరంజితమైంది
ఈ పంచ భూతాలు ఎంత నిజమో
నీ వెనుక నేనున్నాననేది అంతే నిజం
నీ కోప తాపాలు నీ బుంగమూతులూ
నీ రుసరుసల విరుపులు సైతం
తొలకరి మోఘ గర్జనల్లా వినిపిస్తాయి
పురివిప్పే మయూరం నేనేకదా మరి
చల్లని వెన్నెలకి
చక్కని స్నేహానికి  
హ్రుదయపూర్వక వందనాలు

27, జనవరి 2018, శనివారం

ఈ రోజు అలా అలా గడిచిపోతుంది

ఈ రోజు అలా అలా గడిచిపోతుంది
రేపు కూడా అలాగే సాగిపోతుంది 
మరి 
ఈ ప్రశ్నకి అంతం వచ్చినపుడూ.........
ఆలోచించడానికైనా అనుభూతించడానికైనా
నీ దగ్గర ఏమి మిగిలిందనేదే ప్రశ్న
కాలం మిగిల్చే వేదనల్లో నీకోసం తపించిన హృదయాల ఘోష కనబడుతుంది
ఆరోజున వదిలేసిన నీ పైశాచికత్వం కనబడుతుంది
అంతే
ఈ రోజు అలా అలా గడిచిపోతుంది
దాచుకోవడానికి నెమెరేసుకోడానికి చిన్న అనుభూతి లేకుండా
రేపు కూడా అలాగే సాగిపోతూనే ఉంటుంది చితిలో చిటపటలు సర్థుమణిగేదాకా

లెక్కలు తప్పుతున్నాయ్

లెక్కలు తప్పుతున్నాయ్ ఆశలు చెదురుతున్నాయ్ 
గురువా
రెక్కా డొక్కా ఆడించి రొక్కమంతా గుమ్మరించి
చదువుల గోదాలో దించుతున్నాం
ఇరుకిరుకు గదుల్లో బాల్యం బందీ అవుతున్నా
వేటేసే ప్రైవేటులే గురుపూజకి అర్హమౌతున్నాయ్
వేల జీతాలు విశాల ఆవరణలు
మద్యాహ్న భోజనాలు ఇవేవీ మమ్మాకట్టుకోవట్లే
ఏం
లక్షలు ఖర్చౌతున్నా లక్షణం తెలియకపోవడం మా తప్పా
నమ్మకాన్నే నేర్పడం రాని ఈ గురువుల సమర్థత గొప్పా
ప్రైవేట్ పబ్లిక్ ఈ గోలంతా లేని
వసుదైక విద్యా కుటుంబం మా కల
కళలకి కాణాచిగా భవితని రూపొందించడం మీ నేల.
గురువా గద్దించైనా గర్జించైనా నీ ఆస్థిత్వాన్ని నిలుపు
టీచర్ కొలువంటే భుక్తికోసం కాదు
జాతి విముక్తి కోసం అని చాటు
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.
ఓ నిజాము పిశాచమా.....
నిరంకుశ నాజీలా అణిచేసిన రిజ్వీలా
నీ నరహంతక రూపాలు పటాపంచలైన రోజు
పోరాటాల తుది రూపు
అమరుల త్యాగాల గెలుపు
కలగలసి తెలంగానమైన రోజు
ఆపరేషన్ పోలోతో మా పరేషానీ తీర్చిన మహనీయులందరికీ శతకోటి ఉద్యమాభివందనాలు

రణం మా నినాదం

రణం మా నినాదం
దౌర్జన్యాలపై నిరసనం మా ఇజం
నిర్బంధాలని నిరసించడం మా నైజం
నాటి రజాకార్ నుండి నేటి దోపిడీకోర్ వరకీ ప్రతిఘటన రూపం చూపినోల్లం
సాయుధ పోరాటం నుండి చీరల భాగోతం వరకూ దుమ్ము దులిపినోల్లం
రణం మా నినాదం
బతుకునే ప్రశ్నించీ బానిసగా మార్చాలనే కుతంత్రాన్ని
ఎదురించి బతుకమ్మ ఆడినోల్లం
నిర్బంధించిన గళాల్లోనే ఉయ్యాల పాటల్ని
మార్మోగించిన దీరులం
అందుకే
దౌర్జన్యాలపై నిరసనం మా ఇజం
పోరాట స్ఫూర్తితో పోరు తెలంగాణలో సాగే రేపటి పౌరులం
బతుకమ్మ చూపిన దోవలో బరిగీచి నిలిచే తెలుగోల్లం
నా ఆమ్మలక్కలందరికీ ఉద్యమాబివందనాలతో బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

విజేత-పరాజిత

ఒకానొక రహదారి యాత్రలో సూదూర గమ్యాన్ని చేరాలని
వడివడిగా సాగే నడకలో
చిన్న బొడ్రాయి అడ్డొచ్చి కలల్ని చీల్చేసి 
కష్టాల్ని కావలించి
ఇష్టంగా నిన్ను పాతాలమార్గానికి మల్లిస్తే
దొర్లుకుంటూ జారి అద్రుష్యమయ్యేవాడే పరాజిత
దొరికిన ఆసరాని అందుకొని ద్రుగ్గోచరమయ్యేవాడే విజేత

Global Enterprenuer summit 2018

ఉరుకుదాం ఉరుకురికి ఎగురుదాం
ఎందాకా అంటే 
ఏవంక చూసినా అస‌హ్యం అదిరిపోయేలా
అప‌హాస్యం అంతుతేలేలా
విశ్వ‌వినువీదుల్లో వెలుగుజిలుగుల విజయాలు విస్తుపోయేలా
ప‌సిపాపల్ని ప‌రిహారంకోసం అమ్మే అమ్మ‌ల్లా
దేన్నికాద‌నాలి ఏదేది నాద‌నాలి
ఏంటో అంతా గంద‌ర‌గోళం
అభివ్రుద్ది రెక్క‌లు అంత‌లా ఎగురుతుంటే
చెల‌రేగే గాలి దుమారం న‌న్నెందుకు క‌ల‌వ‌ర‌పెడుతుంది
ఎంట్ర‌ప్రెన్యూర్లు వెలుగులు చిందిస్తుంటే
మంట‌ల్లో కాలే గూడులు నన్నెందుకు ద‌హిస్తున్నాయి
మెట్రోలు పైలాన్లు
పాల‌వ్యాన్లు ప‌గ‌టి క‌ల‌లు
దేన్ని కాద‌నాలి ఏది వాస్త‌విక‌మ‌వ్వాలి
సంపూర్ణ‌మైన‌దేది స‌త్యం కాద‌న్న‌ట్టు
ఇప్ప‌టికిందాక అనుకోవ‌డ‌మే మ‌న‌ద‌న్న‌ట్టు
సాదించిన దానికి సంతోషం
చితికిపోయిన దానికి సంఘ‌ర్ష‌ణం
స‌హ‌జం, స‌మాజ నైజం