వేటూరి సుందరరామ్మూర్తి, ఈ పేరు వింటే తెలుగు అక్షరం నిలువెల్లా పులకిస్తుంది, ఆ కళం రాల్చిన పదాలు తెలుగు పాటని సుసంపన్నం చేశాయి, మనసు భారమైనప్పుడైనా ఆహ్లదంగా ఉన్నప్పుడైనా సందర్భమేదైనా వేటూరి పాటలో ఒదిగిపోవాల్సిందే, జాతీయ స్థాయిలో తెలుగు పాటకి కావ్య హోదాని కట్టబెట్టిన మహామహుల్లో వేటూరీ చిరస్మరణీయుడు, ఆ మహనీయుని వర్థంతి మే 22న ఈ సందర్బంగా మరొక్క సారి తెలుగుటీవీ గుర్తు చేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తుంది.
సాంగ్.శంకరా నదశరీరాపరా
1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు, మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి, కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటని జాతీయ వేదికలపై మోతమోగించిన శ్రీశ్రీ తర్వాత అంతకన్నా హ్యుద్యంగా రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే...అంటూ ఓ తల్లి మనోవేదనని కళ్లకు కట్టాడు.
సాంగ్. రాలిపోయే పువ్వానీకు రాగాలేందుకే.
ఇంతటి ఘన విజయాన్ని కూడా ఆత్మాబిమానానికి సాక్షిగా వదిలేశాడు, తెలుగుభాషకు ప్రాచీన హోదాని నిరాకరించిన కేంద్ర ప్రభుత్వానికి తన జాతీయ అవార్డుని వెనక్కిచ్చేసిన సాహసి వేటూరి, తన పాటల్లో కూడా అక్షరాలను పాశుపతాస్రాలుగా సందించిన సందర్బాలు కోకొల్లలు, శంకరాభరణంలో ఆ శివున్నే దిక్కరించిన ఆ కళం ప్రతిఘటన సినిమాలో అసబ్య సమాజపు చెంప చెళ్లుమనిపించాడు.
సాంగ్.ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో,
ఇక ఒకే సినిమాలో విభిన్నపార్శాలున్న పాటలు రాయడం ఒక్క వేటూరికే చెల్లింది, ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్ సినిమా అడవిరాముడులోని సందేశాత్మక గీతం క్రుషి ఉంటే మనుషులు రుషులైతారు అంటూ ఆత్మవిశ్వాసం నింపిన ఆ కళమే ఆకుచాటు పిందెతడితే అంటూ రెండు అర్థాల్ని అత్యంత నైపుణ్యంగా వినిపించింది.
సాంగ్. ఆకుచాటు పిందె తడితే
సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు, తెలుగా తల్లికి ఆయన చేయించిన జూకాలు,
“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.
సాంగ్. నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ
పాటల ప్రయాణంలో అలుపెరగని ఆ బాటసారి బోజనప్రియుడు, కడుపు నిండా తిన్నాక తెలుగువారికి తాంబూలంతో పాటు వేటూరి పాట ఉంటే ఆమజా గురించి చెప్పేదేముంది, 1974లో మెదలైన ఈ పాటల ప్రవాహం, 2011లో ఒంకారేశ్వరీ అంటూ దేవున్ని స్మరిస్తూనే సాగింది. దాదాపు 40దశాభ్దాల తన సినీ గేయ రచనా ప్రయాణంలో ఆయన స్రుష్టించిన ఒక్కో పాట ఒక్కో కావ్యం, కే.విశ్వనాథ్, కే.వీ మహదేవన్, ఇళయరాజా వంటి మహామహులతో కలిసి తెలుగు పాటకి రుదిరదారలతో అర్చన చేశారు వేటూరీ, తెలుగునాట గోదావరి ఎంత సస్యశ్యామలం చేసిందో వేటూరీ పాట కూడా అంత అజరామరం పొందింది.
పాట.ఉప్పొంగెలే గోదావరి
తన పాటలతో అభాలగోపాలాన్ని ఊయలలూపిన ఆ మహాకవి మనల్ని విడిచి వెళ్లి ఆరుసంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఈ ఎడబాటు బౌతికంగా మాత్రమే, వేటూరీ పాట కొమ్మ కొమ్మన పూస్తూ సన్నాయి రాగాలాలాపిస్తుంటే, ప్రతీ తెలుగు హ్రుదయం ఆ రాగసవ్వడిలో అనంతంగా పులకించిపోతూనే ఉంటుంది. వేటూరీ మల్లీ రావా మాకోసం.
పాట. కొమ్మకొమ్మకో సన్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి