13, జులై 2020, సోమవారం

నా తెలంగాణ కంజాతవల్లివి

ఎంత పుణ్యఫలమో ఇవ్వాల నేనిక్కడ నిలబడి ఈ స్వేచ్చాగానాన్ని ఆలపిస్తున్నాను
ఇన్నేండ్లలో నా తెలంగాణా ఎన్ని లక్ష్యాలని ముద్దాడింది
ఎన్నెన్ని కలల్ని సాకారం చేసుకుంది
ఎంతెంత ఆనందాన్ని అనుభవించింది
వీటన్నింటికి కారణమై...
ఇవ్వాల్టి తెలంగాణా ప్రజలందరి బతుక్కి తోరణమై....
మెరిసే పుణ్యజీవుల్ని స్మరించుకోవడమే...
నా స్వేచ్చాగానానికి నిండుదనం.
ఎవరెన్ని చెప్పినా....
చరిత్ర ఎలా రాసినా....
ముమ్మాటికీ నా ఈ నేల రత్నగర్బగా..
కోటి రతనాల వీణగా...
రాగాలాపనలలో.....
శ్రుతి, లయ, రాగం, భావం
ఆత్మబలిధానాలతో ఆచరణకి బాటలు వేసిన నా అమరులకే అగ్రతాంబూలం.
రేపన్నది స్వరాష్ట్రంతోనే ఉంటుందని చైతన్యం చేసిన త్యాగశీలులదే దార్శనికం.
స్వరాష్ట్రం మా జన్మహక్కని చాటిన నాలుగున్నర కోట్ల తెలంగాణా ప్రజలదే అంతిమ విజయం.
1961లొ విఫలమైన చోట 2014లో విజయాన్ని ముద్దాడడం వెనుకనున్నది ఖచ్చితంగా నాయకత్వ వ్యూహం
నేడు చూస్తున్న కుళ్లు రాజకీయాల్లో...
ఎవడేమైపోతే నాకేంటి అనుకునే కుఠిల కపటత్వంలో...
ఆమె ఏ ప్రయేజనాలని ఆశించిందో....
ఏ ఎత్తుల జిత్తులతో ఆటాడిందో....
కానీ తల్లీ....
నువ్వు లేకపోతే....
నువ్వంత కఠినంగా లేకపోతే...
తలుపులు మూసైనా...మా తలపులని నెరవేర్చకపోతే....
నాకల కల్లనే ఔను.
నాకల రావణ కాష్టంలా రగులుతూనే ఉండు.
ఇంకా ఎన్నో బలిదానాలు సాగుతూనే ఉండు.
అందుకే..... అందుకే.....
అమ్మా....
నీ జాతియత నాకక్కరలేదు
నీ మతం నేనెరుగను
నీ కులగోత్రాల ఊసు నాకొద్దు
నువ్వే నా తల్లివి
నా తెలంగాణ కంజాతవల్లివి
జై తెలంగాణ జై జై తెలంగాణ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి