2, జనవరి 2021, శనివారం

బాలూ... వెలిపోయావా...


 బాలూ... వెలిపోయావా...

అమృతాన్ని గళంలో నింపుకొని
గానంలోకి దాన్ని వొంపి
సరాసరి నా చెవుల్లో నింపిన ఆ గాత్రం మూగబోయిందా....
హలోగురు ప్రేమకోసమేరా....
అంటూ నా యవ్వనాన్ని చైతన్యపరిచినా...
ఏదివిలో విరిసిన పారిజాతమో...
నని నా ఊహల్లో సుందర స్వప్నాలు గిసినా...
అంతర్యామి అలసితీనంటూ....
వైరాగ్యాన్ని వో ప్రవాహంలా నాలోకి ఒంపినా...
అది నీ గాత్రానికే చెల్లింది బాలూ....
ఉత్సాహం ఆవిరై
బతుకు మీద విరక్తి వచ్చిన వేల
నీ పాట ఓ ఉత్తుంగ తరంగమై నన్ను సేదదీర్చింది
ఉషారు ఉప్పొంగి ఊరంతా ఊరేగే వేల
నీ గొంతు దాన్ని రెట్టింపు చేసింది
బాదతో ముడుచుకుపోయినప్పుడేమో
హ్రుద్యంగా నీ గొంతు పలికిన బావన ద్రవింపజేసింది
అసలు నువు మాతో లేనిదెప్పుడు
పాటల తోటలో రారాజులా
ప్రతీరోజు నీ గానం వినని తెలుగు ప్రాణం ఉండదు
సంగీతకారుని స్వరాలకి
సాహిత్యకారుని అక్షరాలకి
నీ స్వరం ప్రాణం పోసింది.
కడుపేదవాని కడగండ్లకి
కడుమిక్కిలి సంపదలిండ్లకి
ఆ గాన ప్రవాహం ఒకేరీతిన గారాలు పోయింది.
మాటలకున్న బాషల్ని
నీ గానం చెరిపేసింది
విశ్వజనీనమైన సంగీతబాషతో నీ గళం
చిరస్థాయిగా మా చెవుల్లో మార్మోగుతుంది
ఎన్నెన్ని వైరుధ్యాలు
ఎన్నెన్ని మధురసాలు
అల్లరి పిల్లవాడు మొదలు పండు ముసలి స్వరం వరకూ
నీ గళం వైవిద్యాలు పోతుంటే
వాయిద్యాలు సైతం విస్మయం పొందాయేమో
గోదారి పిల్లతెమ్మెరలను
కృష్ణమ్మ గలగలలనూ
కోకిల కంజీరవాలనూ
ఉషోదయ నులివెచ్చ కిరణాలనూ
ఒకటేమిటి సమస్త ప్రకృతి పరవశాన్ని
పాటలో పొదివిన కంఠమది
బాలూ...
నువ్వెక్కడికీ
వెల్లలేదు, వెల్లువై...
మా లోలోపలికి
మా అంతరాంతరాల్లోకి
మా హ్రుదయాంతరాల్లోకి
చొచ్చుకుపోయావు
లయబద్దమైన నీ ఉఛ్వాస నిఛ్వాసాల్లో
మా ప్రాణవాయువు ఏనాడో లీనమైంది
ఇక గరళ కంఠుని ఎదుట
అమృత కంఠుని కచ్చేరీలు మార్మోగుతుంటాయి
గంగాడి సుధీర్.
(నేను రాసిన పాట నీ గొంతులో వినాలన్న నా కోరిక తీర్చకుండానే వెలిపోయావన్న కోపం నీ మీద బాలూ....)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి