2, జనవరి 2021, శనివారం

Happy new year 2021

 జీవితకాల అనుభవాల్ని

జీవితమంతా వెతికినా దొరకని అనుభూతుల్ని

సంక్షోభంలోనూ సాగే బతుకు భారాన్ని
సంబరంలోనూ దక్కని ఆనందపుటంచుల్ని
కరోనాతో కలిపి అందించిన కాలం కరిగిపోయింది.
రేపు మంచే రావాలని కోరుకుంటూనే కదా స్వాగతిస్తాం
ఐనా... వచ్చేదేదైనా స్వాగతించే స్థైర్యం తెచ్చుకుందాం
క్యాలెండర్ రెక్కలు ఒక్కోటి రాలిపోతుంటే
డైరీలో పేజీలు సిరాక్షరితో రంగుతేలుతుంటే
మరో వత్సరం నులివెచ్చగా స్పర్శిస్తూ సమాగమిస్తోంది.
నిన్నా... నేడు.... రేపు అనుకొంటే
కేవలం అంకెలు
కేవలం రోజులు
కేవలం దారులు
నిన్నా... నేడు.... రేపు అనుకొంటే
సరికొత్త ఉషోదయ ప్రాకారాలు
ఓటమిలోంచి ఎలుగెత్తే విజయనాదాలు
ఆశలతో చిగురించే కొత్తగానాలు
అందుకే అందరికీ అనుకున్నవి జరగాలి
జరిగినవే నిను నిలబెడ్తాయి
Happy new year 2021

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి