జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ
ఈ నినాదమే మా సమరనాదం
ఈ నినాదమే మా స్వాతంత్ర్యగీతం
ఈ నినాదమే మా స్వేచ్చా సంతకం
పరాయి పాలన మాకొద్దని ఢిల్లీని కదిలించిన మల్లయోదులం
పాలకులు, పాలితులు రెండు కులాల జాడలే నిజమని తెలిసిన కర్మయోగులం
కఠిన పాషాణాలనూ కరిగించిన ఉద్యమ ధీరులం
ఎప్పటికీ తెలంగాణోల్లం
అందుకే జై తెలంగాణే మా ఏకైక నాధం
నిర్జీవమైనా, సజీవమైనా నాప్రతీ అణువణువులో జీర్ణించుకున్న ఉద్యమ శ్వాస
అరవై ఏళ్లుగా అరిగోసలు పడి కాపాడుకున్న నిప్పుల కుంపటి
ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ అనుఫానుల్లో పెనవేసుకున్న ప్రశ్నల ఫరంఫర
అణిచివేతను సహించని దిక్కార స్వరం
అప్యాయతలు అల్లుకున్న కమ్మని మెరటు తనం
ఇది నా మట్టి, ఇది నా గాలి
ఇది నా ఇళ్లు, ఇదే నా నైజం
దేహంపై కర్మజలం చల్లి నా తల్లి భూగర్బంలో తలదాచుకొనే చోటిది
నా నైజం మారదు, నా ప్రశ్న ఆగదు
మార్పు మనుగడకే కాని మనో: గడకు కాదు
అప్పటిది, ఇప్పటిది, ఎప్పటిది
జై తెలంగాణ మెక్కటే
అందుకే.... సోదరా....
జై తెలంగాణ, జై తెలంగాణ, జైజై తెలంగాణ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి