సార్వభౌమత్వం స్వాభిమానం
ఇవి జంటపదాలో...
ద్విపదులో....
జాతి గర్హాలో...
గర్వాలో... గర్జనలో....
నేడివి
చర్చనీయాంశాలు... చైతన్య ప్రవాహాలు...
విశ్వమానవ
కళ్యాణానికి
విశ్వగురూ
వికాసానికి
విశ్వ వైప్లవ్య
ప్రభోదానికి
విశ్వజనీన
అంశీభూతం నా దేశం
అందుకే....
విశ్వమంతా నా
దేశం వైపు చూస్తుంది
కరోనాసుర అంతం
కోసం కంటైనర్లలో తరలొస్తున్న వ్యాక్సిన్ బుడ్డీల కోసం
విశ్వమంతా నా
దేశం వైపు చూస్తుంది
దేహాలనే కర్షక
క్షేత్రాలుగా చేసి హలాలనొదిలి రాజదాని గుడారాల్లో చేరిన రైతు న్యాయాల కోసం
విశ్వమంతా నా
దేశం వైపు చూస్తుంది
ఆరుగాలం అన్యాయాన్ని
ఆపమని నినదిస్తుంటే నిద్దరోయిన సెలబ్రిటీ పట్టు పరుపుల కోసం
విశ్వమంతా నాదేశం
వైపు చూస్తుంది
విశ్వమానవుడి
స్పందనలపై అఘమేఘాలై విరుచుకుపడుతున్న స్వార్వబౌమ సింహాల కోసం
విశ్వమంతా...
నాదేశం వైపు
చూస్తుంది
నాదేహం వైపు
చూస్తుంది
నా మోసం వైపు
చూస్తుంది
నా కంచెల వైపు
చూస్తుంది
నా కట్టుబాట్లని
చూస్తుంది
నాపై కమ్మిన
ఉగ్రవాదం వైపు చూస్తుంది
నాపై వేసిన
అభాండాలను వింటుంది
నేనే లేకుండా
చేసే కుట్రకోణాల్ని కంటుంది
స్వాభిమానమో....
సార్వభౌమత్వమో...
నన్నే లేకుండా
చేస్తానంటే....
నా ఉనికినే
ప్రశ్నిస్తుంటే....
నా నరాల్లో రక్తపు
దారులకు నరమేదాన్ని అంటించాలనుకుంటే...
నా పొలాల్లో పారే
నీళ్లకు కార్పోరేట్ సాంద్రతను చేకూరుస్తుంటే....
అసంఘటిత రంగమే
కదా....
అడిగే
వాడెవడనుకుంటే...
గడ్డిపరకలు ఒక్క
చోట చేరి పురితాళ్లను పేనుతున్నాయ్
చలి చీమలు దారిని
వెతుక్కుంటూ దడిలా గడీని కడుతున్నాయ్
అది ఉరితాడు
కావాలో.... జంద్యమే కావాలో...
సమాదులే
కావాలో.... కోటలా మారాలో....
తేల్చుకోవాల్సింది
మీరే
మీరంటే కీడు
చట్టాలు చేసే పాలకవర్గాలే కాదు
అన్యాయం
వికటాట్టహాసం చేస్తున్నప్పుడు
నోరుమూసుకున్న
నయవంచకులు
అబాగ్యుని
ఏకాకిని చేసేందుకు
దండుకట్టిన
దగుల్బాజీలు
మన బిడ్డలే
కదా.... ఇకనైనా స్పందిద్దాం
ముళ్లకంచెలతో
కాదు మనసు చంచలంతో ఆదరిద్దాం
నష్టనివారణకోసంకాదు
నలుపు మచ్చ రాకుండా చూద్దాం
జై కిషాన్ జై
హిందుస్థాన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి