14, జూన్ 2021, సోమవారం

గురువు బిక్ష

 

పద్మవ్యూహమైన ప్రపంచంలోకి

అమ్మగర్బంలోంచి అభిమన్యుడి అంశతో భయల్దేరానూ....

ఏది మంచో... ఏది చెడో...

ఏది ఒప్పో... ఏది తప్పో....

ఏం చేయాలో... ఏం చేయకూడదో....

తెలియకుండానే ప్రయాణం సాగేదేమో....

కానీ

నాకొక మార్గదర్శనం దొరికింది

నాదారి పోడువునా చీకట్లను పారద్రోలే కాంతి ఫుంజం మెరిసింది

అప్పుడే విచ్చుకున్న నా కళ్లకు

ఉదయకాంతిని చూపించే  చదువుల భానుడు ఎదురొచ్చాడు

గురువు దొరికాడు

గురుతర భాధ్యతల్ని తను తీసుకొని నన్ను మలిచాడు

గతి తప్పని ఆలోచనలని

వక్ర మార్గమెరగని ఆచరణని

సమాజంలో నా సుస్థిరతని

తానే స్థిర పరిచాడు

ఆదిప్రణవమైన అ ఆ...లు మెదలు

అనంతమైన సంగతులు బోదించాడు

రూపంలేని నా స్వరూపానికి

శిల్పిలా...కుంచెలా....పాళిలా...

కమ్మరి కొలిమిలా... కుమ్మరి చక్రంలా... చేనేత రాట్నంలా...

నన్ను తీర్చిదిద్దాడు....

అభిమన్యుడి అసంపూర్తి నుండి

పార్థుని పరిపూర్ణం వరకూ

పద్మవ్యూహం చేదించి భ్రతుకు బండిని సాగించే వరకూ..

గురువుల బిక్ష నా ఈ కక్ష్య

గురువుల బిక్ష నాలో ప్రజ్ణ

గురువుల బిక్ష నేనే ఇంకా.....

గురుదేవోభవ, ఆచార్యదేవోభవ

అమరత్వదేవోభవ ఆచార్యదేవోభవ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి