27, మార్చి 2020, శుక్రవారం

కాఠిన్యమే కారుణ్యం


తొలిసారి నిను చూసిన నాకు
అమాయకత్వము ప్రతిఫలించే
అమ్రుతమూర్తిలా అగుపించావు నేస్తం

కాలం కరిగిపోతున్నప్పుడు నీలోని
కఠినత్వం భయల్పడుతున్నప్పుడు
చూసా నిన్ను

అమ్రుత మూర్తియైన శ్రీ క్రుష్ణుడు కూడా
నరకుని చూసి ఉగ్రుడయ్యాడు.
నరలోకంలో వున్న భకాసురులని చూసి
బుస్సున పొంగే నీ మనసుని చూసి
మూర్కులు మాత్రం మాటలంటారు
నీ నేస్తాలెప్పుడూ నీ తోడుంటారు.    ----29.03.2000

వీడ్కోలు నేస్తం

అల్లరి చిల్లరి ఆటలతో
మల్లెల చినుకుల మాటలతో
మరపురాని లోకం మనదీ
తిరిగిరాని కాలం మనదీ
కంచం ఒకటే మంచం ఒకటే
తనువులు వేరైనా తపనలు ఒకటే
పరీక్షలు రాసేసాం
ప్రయాణానికి చేరువయ్యాం
గతమంతా తలపుల గజిబిజి
ఎన్నాళ్లకు వస్తుందో మళ్లీ నిశీధి
దూమ పానాలెన్నో చేసాం
దూర ప్రయాణానికి సిద్దమయ్యాం
పోరీలకు బీటేషాం... పోపోరా అని సవాలు చేసాం.
కాలేజీకి కలిసెల్లాం
కష్టాలను కరిగించాం
అమ్మదరికి చేరువైనా ఆత్మ మాత్రం నీ దరినే 
ఆకాశం నువ్వనుకుంటూ ప్రతీరోజూ నిను చూస్తుంటా. ----- 
29.03.2000

ఫేర్ వెల్


స్నేహ బందాల నుంచి తరగని దూరాలకు తరలిపోతున్నాం.. కానీ...
తన్మయత్వాల తలపులన్నీ
మల్లెపూల వాసనోలే
మనసునిండా నింపుకున్నాం
వలపు నిండిన తలపు గడియలన్నీ
తరాలలోని అంతరాల కన్నా
ఇగిర్చి పోతున్న చివరి క్షణాలను
ఉషోదయం కోసం
యశస్సు రేఖలు చేద్దాం నేస్తం.
14.01.2000

ఇంద్ర ధనస్సు

కోయిల కంఠంలా వెన్నెల చందం
పెళ్లికూతురి మురిపెంలా
శోభనపు సోయగంలా
రాముని విల్లులా
సీతమ్మ మనసులా
ఆకాశపు కాంతుల హరివిల్లు అందాలు
ఇంద్రలోకపు జిగెల్ కాంతులు
రంభ మేనకల కాలి అందేలు
చిన్నబోవ నీ చిరువదనంతో
నా గుండె మనసులోకి భావాలూదిన
ఇంధ్రదనస్సుకు వందనం... పాధాబివందనం.         07.01.2000

అవని అవశేషాలు


ఎక్కడో సంద్రాన సుడులు రేగుతున్నాయ్
ఆ గాడ్పుల ప్రవాహానికిక నిలిచుండేదెవరు
మహా మారుత ప్రళయానికి
సంకేతంలా... ఆ దిక్కున కన్పిస్తున్నాయ్
పెచ్చులూడిన అవని అవశేషాలెన్నో.....
                                                --- సుధ 19.08.2004

పోరాటానికి సమాయత్తం


ఈ ఉషోదయ ప్రభాత వేలలోన
తూర్పు దిక్కున మెరిసిన తొలికిరణం
ఏవో వెలుగుల్ని విరజిమ్మింది నాలో...

 ఆశల మెరుపుల్ని మెరిపిస్తూ..
గుండెలోకి ఉత్సాహ కెరటాల్ని
నింపింది ఆ పవనం.

చల్లారి, మెద్దుబారిన నా మస్థిష్క కవాటాల
దుమ్ముని విదిలించమంటూ...
కర్తవ్య, కార్యాచరణాల్ని బోదించిందీ వేల.

ఆరాటంతో పోరాటం సాగించిన
నీ మనసుకిక నిబ్బంరంతో  నింపి
అసలైన పోరాటానికి సమయమాసన్నమైందంటూ...

పరీక్ష పేరేదైనా మన పోరాటానికి లక్ష్యం ఒక్కటే...
ఆశయాలేవైనా... గెలుపే వాడికి నిండుతనాన్నిచ్చేది
                                      --- సుధ 19.08.2004

కరోనా తుడిచేయ్

అయ్యో..
ప్రపంచం అంతం అయిపోతుందా...
నేను, నా పెళ్ళాం, నా పిల్లలు, నా అమ్మా నాన్నా, నా కుటంబం మెత్తం నాశనమై పోతుందా...
అయ్యో...
నేను కొన్న ప్లాట్లు, కూడ బెట్టిన బంగారం, సంపాదించిన ఆస్థులు, నేను చేస్తున్నఉద్యోగం, నేనుంచుకున్న షేర్లు, నా కోసం దాచుకున్న బీర్లు, కోట్లుగా మూల్గుతున్న బాంక్ బాలెన్స్ ఇవన్నీ ఎట్లా...
అయ్యో....
నేనొక్కన్నే పోతానా... నాతో పాటు ప్రపంచం మెత్తం పోతుందా...
ముఖ్యంగా నా పక్కింటోడు పోతాడా... మా భాస్ కూడా పోతాడా...
మెన్న నాతో గొడవపడ్డోడు పోతాడా....
అయ్యో...
రోజూ దేవునికి నైవేద్యాలు పెడితి గదా...
పాలాభిషేకాలు, పులిహోర దద్దోజనాలు
పండగల ప్రత్యేక పూజలు అన్నీ చేస్తి గదా...
అయ్యో....
మల్ల కొంత మంది బతికే ఉంటరట గదా...
అండ్ల నన్నుంచ రాదు
ఏమన్నా చేసి నన్ను నా కుటుంబాన్ని బతికించండి ప్లీజ్
సర్కారు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నా... కావాలంటే ఎంతో కొంత ఇస్తా...

ఈ సంకట స్థితిలో, సంక్షోభ దశలో సైతం
అయ్యో...
ఈ విపత్తు ఎట్లచ్చో
విచ్చలవిడి స్వార్థంతో ప్రక్రుతిని మెత్తం అనుభవించితి గదా....
అయ్యో...
నా ఒక్కడి పొట్టకి పదిమంది తినే తిండి తింటి గదా...
అయ్యో...
విశాలమైన ఇల్లు కట్టుకొని మనసు ఇరుకుగా ఉంచుకొంటి గదా...
అయ్యో...
ఆన్నార్థుల ఆకలి కేకల్ని కారు అద్దాలెత్తి వినకపోతి గదా...
అయ్యో...
నాలెక్కనే అందరికీ, అన్నిటికీ ఈ భూమ్మీద హక్కుంది గదా...
అనే ఆలోచనే రాని
నిక్రుష్ట మానవ జన్మ నాది
ప్రతీ రోజు చెరచబడ్డ ప్రక్రుతి ప్రకోపం చూపించినా...
ఇంకా నేను, నాదీ అనుకొనే
నీచ మానవ జన్మ నాది
కరోనా.... రావమ్మా...
నాదీ. నేను అనే నా అహంబావాన్ని
నేనే తోపు అనే అజ్ణానాన్ని
సమూలంగా తుడిచేయ్
సమూహంలో ఒకడిననే స్రుహ ఉన్న ప్రతోన్ని వదిలేయ్