27, మార్చి 2020, శుక్రవారం

కరోనా తుడిచేయ్

అయ్యో..
ప్రపంచం అంతం అయిపోతుందా...
నేను, నా పెళ్ళాం, నా పిల్లలు, నా అమ్మా నాన్నా, నా కుటంబం మెత్తం నాశనమై పోతుందా...
అయ్యో...
నేను కొన్న ప్లాట్లు, కూడ బెట్టిన బంగారం, సంపాదించిన ఆస్థులు, నేను చేస్తున్నఉద్యోగం, నేనుంచుకున్న షేర్లు, నా కోసం దాచుకున్న బీర్లు, కోట్లుగా మూల్గుతున్న బాంక్ బాలెన్స్ ఇవన్నీ ఎట్లా...
అయ్యో....
నేనొక్కన్నే పోతానా... నాతో పాటు ప్రపంచం మెత్తం పోతుందా...
ముఖ్యంగా నా పక్కింటోడు పోతాడా... మా భాస్ కూడా పోతాడా...
మెన్న నాతో గొడవపడ్డోడు పోతాడా....
అయ్యో...
రోజూ దేవునికి నైవేద్యాలు పెడితి గదా...
పాలాభిషేకాలు, పులిహోర దద్దోజనాలు
పండగల ప్రత్యేక పూజలు అన్నీ చేస్తి గదా...
అయ్యో....
మల్ల కొంత మంది బతికే ఉంటరట గదా...
అండ్ల నన్నుంచ రాదు
ఏమన్నా చేసి నన్ను నా కుటుంబాన్ని బతికించండి ప్లీజ్
సర్కారు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నా... కావాలంటే ఎంతో కొంత ఇస్తా...

ఈ సంకట స్థితిలో, సంక్షోభ దశలో సైతం
అయ్యో...
ఈ విపత్తు ఎట్లచ్చో
విచ్చలవిడి స్వార్థంతో ప్రక్రుతిని మెత్తం అనుభవించితి గదా....
అయ్యో...
నా ఒక్కడి పొట్టకి పదిమంది తినే తిండి తింటి గదా...
అయ్యో...
విశాలమైన ఇల్లు కట్టుకొని మనసు ఇరుకుగా ఉంచుకొంటి గదా...
అయ్యో...
ఆన్నార్థుల ఆకలి కేకల్ని కారు అద్దాలెత్తి వినకపోతి గదా...
అయ్యో...
నాలెక్కనే అందరికీ, అన్నిటికీ ఈ భూమ్మీద హక్కుంది గదా...
అనే ఆలోచనే రాని
నిక్రుష్ట మానవ జన్మ నాది
ప్రతీ రోజు చెరచబడ్డ ప్రక్రుతి ప్రకోపం చూపించినా...
ఇంకా నేను, నాదీ అనుకొనే
నీచ మానవ జన్మ నాది
కరోనా.... రావమ్మా...
నాదీ. నేను అనే నా అహంబావాన్ని
నేనే తోపు అనే అజ్ణానాన్ని
సమూలంగా తుడిచేయ్
సమూహంలో ఒకడిననే స్రుహ ఉన్న ప్రతోన్ని వదిలేయ్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి