ఈ ఉషోదయ ప్రభాత వేలలోన
తూర్పు దిక్కున మెరిసిన తొలికిరణం
ఏవో వెలుగుల్ని విరజిమ్మింది నాలో...
ఆశల
మెరుపుల్ని మెరిపిస్తూ..
గుండెలోకి ఉత్సాహ కెరటాల్ని
నింపింది ఆ పవనం.
చల్లారి, మెద్దుబారిన నా మస్థిష్క కవాటాల
దుమ్ముని విదిలించమంటూ...
కర్తవ్య, కార్యాచరణాల్ని బోదించిందీ వేల.
ఆరాటంతో పోరాటం సాగించిన
నీ మనసుకిక నిబ్బంరంతో నింపి
అసలైన పోరాటానికి సమయమాసన్నమైందంటూ...
పరీక్ష పేరేదైనా మన పోరాటానికి లక్ష్యం ఒక్కటే...
ఆశయాలేవైనా... గెలుపే వాడికి నిండుతనాన్నిచ్చేది
---
సుధ 19.08.2004
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి