అమ్మ, పాలతో రంగరించిన మమకారాన్ని మర్చిపోగలమా...
జానెడు పొట్టకి తొలి ఊతాన్నిచ్చిన ఆ స్తన్యాన్ని తలచుకోకుండా
ఉండగలమా...
కనులు తెరవక ముందే... కాలాన్ని చూడకముందే...
ముర్రుపాలతో ఈ కలికాలాన్ని ఈదే దైర్యాన్ని ఇవ్వలేదా...
తొమ్మిదినెలల తన బరువుని
మురిపాలు అందిస్తూ మరో తొమ్మిదినెలలూ తన పొత్తిల్లలో
పొదగలేదా...
జన్మని మనకిస్తూ పునర్జన్మ తను పొంది
ఉగ్గుపాలతో మన వ్యక్తిత్వానికి నగిషీలి చెక్కలేదూ....
ఆ పాలే అమృతమై మన మార్గాన్ని చూపెడుతున్నాయి.
తల్లిపాలు తాగిన రుణాన్ని తీర్చుకొమ్మని
కబురంపుతున్నాయి.
అందమనో...నిస్సత్తువనో..టైంలేదనో...
పసిబిడ్డకి పాలివ్వక పాపాల పాలు కావొద్దని
హెచ్చరిస్తున్నాయి
పాలిచ్చి ఇద్దరూ పదికాలాలు పచ్చగా బతకమని దారి
చూపుతున్నాయి.
నీ బిడ్డకి పాలిచ్చి నీ తల్లిపాల రుణం కొంత
తీర్చుకోమంటున్నాయి....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి