19, నవంబర్ 2017, ఆదివారం

సినారే

గురువా!
నీ రాకతో ధాత్రి నవ చైతన్యగాత్రి.
ఆప్తుడా!
నీ రేఖతో ప్రకృతి రూపెత్తిన ద్యుతి.
ఎక్కడికెళ్ళావు గురువా
వినువీది విశ్వంభరలో వెలుగులు నింపడానికా.
ఒక్క నోటిని నొక్కేయాలని చూస్తే
లక్ష్మకంఠాలై మోగుతుంది
అని సింహనాదం చేసి
నిదుర పోయిన మా చైతన్యాన్ని ఉరకలెత్తించి
ఎక్కడికెళ్ళావు గురువా
ఏ దిగంతాలలో సాహిత్యగోష్టిని నిర్వహించడానికా
తిరిగొస్తావా గురువా
ఈ విశ్వంభరని వెలిగించడానికి...
మా కండ్లు ధారలుగా వర్షిస్తున్నాయి
హనుమాజీపేట ఝంఝాతమై గర్జిస్తొంది
రా గురువా
ఈ సుధీరుని మనసు అరల్లోకి
రాగరంజితమై
మేఘాన్ని చీల్చుకొని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి