28, నవంబర్ 2019, గురువారం

స్వేచ్చే మా రణ నినాదం

అధైర్యం వద్దు
పోరాడటమంటే బతికుండడమే
ఎన్నెన్నో చూసినోల్లు
ఇబ్బందుల్ని ఫాబందీ చేసినోల్లు
ప్రయాణాన్నే మజిలీగా మార్చుకున్నోల్లు
గమ్యం తప్పక చేరతారు
గమనాన్ని ఆపకండి
తప్పో ఒప్పో సత్యానికి ఓటమి లేదు
నీకై నువ్వు మరణ శరణు వేడావంటే..
ఓటమొక్కటే కాదు,
నీ కోరికలోని న్యాయాన్ని నువ్వు ప్రశ్నించడమే?
అధైర్యం వద్దు...
అమరణ రణమే నీ తొలిపొద్దు.


ఇవాళ గెలుపెవరిదో.... 
గాయమెవరికో.....
అనేక బందనాల సంకెళ్లని తెంచుకొని
కలబడి నిలబడిన నా గానం
గొంతునొక్కితే ఆగిపోయే రాగ స్వరం కాదు మాది
స్వేచ్చనాపితే విస్పోటనం చూపే మంద్ర స్వరం వేడిది
ఎవరో విదిల్చితే ఏరుకునే ఎంగిలాకులం కాం
దిక్కార స్వరం తెలిసిన సమర శీలురం మేం
ఏనాటికైనా 
పోరాటమే మా అజెండా
ఆత్మస్థైర్యమే మా జెండా
స్వేచ్చే మా రణ నినాదం
సంఘర్షణే మా మరణ విదానం 

వరుణా నీ కరుణకావాలి

చిరుజల్లుల తుంపెరల్లో తడుస్తే...కన్నె ప్రేయసి తొలిముద్దులు కురుపిస్తున్నట్టుగా ఉంటుంది
రుతుపవనాల రాకతో... పల్లెం నిండా పరమాన్నం పరుచినట్టే ఉంటుంది
సడులతో సుడులు తిరుగుతూ ఉరకలెత్తే పిల్ల కాలువలు మెదలు
వయ్యారి వంపులతో వన్నెచిన్నెలు చిందే నదుల జలపాతాల వరకూ...
చినుకుతో నా చెలిమి ప్రాణవల్లరి తీగపై పసిడి రాగాల కోయిల బలిమి
ఏ పొద్దు ఆ పొద్దుకే అందమైనది
ఏ కాలం ఆ కాలానికే సొగసైనది
నైరుతిలో రాక నన్నెంత నిరాశ పరిచావో...
కార్తీకమైనా పోక అంతే విసుగు తెప్పిస్తున్నావు
అద్దంలా నను ముద్దుగా చూసుకునే నా హైదరాబాది రోడ్లు...
నీ అన్యాయ గాడ పరిష్వంగనంతో అతలాకుతలమైనాయి...
నీ అదర చుంబన పీడనలతో నొక్కుల పొక్కలు తేలాయి...
ఆవేశమో... మోహావేశమో... అలవికాని వేల నీ మదనతాపమేంటి..
"రేపే" ఇది ఖచ్చితంగా నా రహదారులపై, నా పొలాలపై మైకంతో కమ్మేస్తూ...
నువు చేస్తున్న అత్యాచారమే ఇది
దయచేసి శాంతించు....
మన్మద రాత్రిలో....
పొలాలలో హలాలు తిరుగాడు వేళ
నీ ఉద్రుతమైన మేఘ గర్జనల కౌగిలింతల్ని కప్పుకుందాం...
ఇప్పుడైతే.. ఆషాడ మాస కొత్త జంటవలె కొన్నిరోజులు విశ్రమిద్దాం...

రుణం తీర్చుకుందాం



అమ్మ, పాలతో రంగరించిన మమకారాన్ని మర్చిపోగలమా...
జానెడు పొట్టకి తొలి ఊతాన్నిచ్చిన ఆ స్తన్యాన్ని తలచుకోకుండా ఉండగలమా...
కనులు తెరవక ముందే... కాలాన్ని చూడకముందే...
ముర్రుపాలతో ఈ కలికాలాన్ని ఈదే దైర్యాన్ని ఇవ్వలేదా...
తొమ్మిదినెలల తన బరువుని
మురిపాలు అందిస్తూ మరో తొమ్మిదినెలలూ తన పొత్తిల్లలో పొదగలేదా...
జన్మని మనకిస్తూ పునర్జన్మ తను పొంది
ఉగ్గుపాలతో మన వ్యక్తిత్వానికి నగిషీలి చెక్కలేదూ....
ఆ పాలే అమృతమై మన మార్గాన్ని చూపెడుతున్నాయి.
తల్లిపాలు తాగిన రుణాన్ని తీర్చుకొమ్మని కబురంపుతున్నాయి.
అందమనో...నిస్సత్తువనో..టైంలేదనో...
పసిబిడ్డకి పాలివ్వక పాపాల పాలు కావొద్దని హెచ్చరిస్తున్నాయి
పాలిచ్చి ఇద్దరూ పదికాలాలు పచ్చగా బతకమని దారి చూపుతున్నాయి.
నీ బిడ్డకి పాలిచ్చి నీ తల్లిపాల రుణం కొంత తీర్చుకోమంటున్నాయి....

ఆదిమమే అంతిమమా.....?


మనుషులు మనీసులైపోయిన సందర్భంలో
 అంతా నాకే అన్నీ నావాల్లకే అనుకొనే సంకుచితంలో
 బావోద్వేగాలు కూడా బండలైపోయాయి చిన్నారుల్లారా
 చేయగలిగేదేమీ లేదు
 చెప్పే నీతులు నీకేం చేయవు
అయినా చెప్తున్నా
మీ శరీరాన్ని బండబర్చుకోండి, రాతియుగాల్లోలా
అందిన కాడా దోచేయండి ఆదిమన్యాయం మార్గంలో
 మరన్నీ మార్గాలూ మూసుకుపోయాయి
 సమసమాజం సామ్యవాదం నక్సలిజం నేచురలిజం కాపిటలిజం కారుణ్యవాదం
 ఒక్కటేమిటి అన్నీ చెరచబడ్డాయి
అందుకే ఆదునికాన్ని కాదు ఆదిమాన్ని ప్రతిష్టిద్దాం కనీసం చలిని తట్టుకొనే తోలన్నాతొడుక్కోవచ్చు
అందరూ ఒకటే అనే సత్యాన్ని తిరిగితేవచ్చు
అదొక్కటే మందు మరి go back again and again go back

21, డిసెంబర్ 2018, శుక్రవారం

traffic song


ప్రేయసీ ప్రియులు విడివిడిగా ముఖ్యమైన పనిమీద వెళ్తుంటారు కానీ ట్రాఫిక్ గజిబిజిలో చిక్కుకుపోయి టైం వేస్టవుతున్నప్పుడు వచ్చే పాట.

పల్లవి
రయ్యిరయ్యిన దూసుకెళ్లే మోటార్ బండి జామయ్యే
గల్లి గల్లిన ఆగిన బండ్ల ఘల్లు ఘల్లు షురువాయే
కారులోపల స్టీరియోల గోల గోల
ఎండ మిలమిల చక్కెరొచ్చి తిరగాలా
చిక్కులురా ట్రాఫిక్ తిప్పలురా బాగ్యనగరి బతుకికి బాటలురా.....

చరణం1
గుసగుస ముచ్చట్లో సరసాల సైరన్లు
ఊపిరాడని ముసుగుల్లో నిట్టూర్పు సరిగమలు
పాటల ఎఫ్ ఎంలో తిక్కతిక్క సొల్లు మాటలూ
ఇయర్ పోన్లల్లో మోతెక్కే సౌండ్ పాటలూ
నడుముల వంపుల్లో నొప్పుల పులకరింతలూ
నయనాలు నాసికల్లో నల్లని పొగమేఘాలూ
అబ్బా బతుకేమోగానీ బస్టాండయ్యిందే

చరణం2
సంస్కారపు పిడివాదం కార్లో ఏక పాదం
ఆకారన అత్యద్బుతం చీమల బారంతైన లేదు ఇగురం
ఆర్థికపు ఆరాటం కాల్చేదేమో పరాయి ఇందనం
మెహాన అలంకారం రొడ్డుకేమో జూగుప్ప లాలాజలం
సందులో చిలకొట్టడం పరిపరిగా లొల్లిపెడదాం
ఎకిలీ చూపులతో అమ్మాయిని ఆవురంటు తినేస్తాం
చిన్నకు పెద్దకు తేడాలేదు బరబాసు బతుకైందే


20, డిసెంబర్ 2018, గురువారం

sad song female


చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ప్రేమికుల ప్రేమని అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడమే కాక ఒకవేళ నువు అతన్నే కావాలని కోరుకుంటే వెళ్లొచ్చు కానీ మేం ఖచ్చితంగా చచ్చిపోతాం అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినపుడు ఆ అమ్మాయి అబ్బాయితో బ్రేకప్ చేసుకొని వెళ్లిపోయినప్పుడు వచ్చే పాట
సోలో.....
పల్లవి
వెలిపోయే శ్వాస, మిగలని ఆశలో
వెలుగంతా మాయమై కమ్మేసే నిశిదిలో......
ఆయువునే ఇచ్చిందొక బందం
ఆశలతో అల్లెను తన బందం
ఏ దారీ తెలియకా ఏ వైపో పోతున్నా...
నిశి రాత్రీ ఘడియలో  నిప్పుల పిడుగులో........

చరణం1
బుడి బుడి అడుగుల్లో నడకకి ఆదారం
నిజమయ్యే ఊహలకీ అదే పెను ఘాతం
తోడున్న గమనంలో నీడైన దరహాసం
జంట పయనాన పడగై విష కాలం
కాదంటే కరుగునా నిన్నటి మమకారం
నీడల్లే వదులునా పేగిచ్చిన బందం
చరణం2
ఊహల రేపటిలో తనువులో సగబాగం
ఊరేగే యదలో తనే లయ నాదం
రేపటి కిరణమై వెలగాల్సిన చోట
మరణాలు చరణాలై తనువుని చాలిస్తే
ప్రణయాలే ప్రళయాలై ప్రమాదంలో పడితే
బతికుండీ వదులునా ప్రేమల కారుణ్యం...

19, డిసెంబర్ 2018, బుధవారం

sad song male


గాడంగా ప్రేమిస్తున్న అమ్మాయి అనుకోని సంఘటనలో చూసి తన ప్రియున్నొక మోసగానిగా భావించి ప్రేమని వ్యక్తపరుద్దామనుకొని వచ్చి అసహ్యించుకొని వెళ్లిపోయిన తర్వాత తనని కన్విన్స్ చేస్తూ ప్రేమికుడు పాడే పాట...
చివరలో అమ్మాయి తప్పుతెలుసుకొని మళ్లీ కలుసుకోవడం రావాలి.

పల్లవి.
మరి మరి చెప్తున్నా నా మనసే తెరుస్తున్నా
కనులైనా కలనైనా నువ్వే నా హ్రుదయపు మంత్రం
నీతోనే నా సంతోషం, చూసిందంతా చూపుది కాదే
చెపుతున్నానే నా వలపు కథనాన్నే
చరణం1
అబద్దాల గజిబిజి తనమది
అంతులేని నిజమేదో కనమని
నమ్మకమే తప్పక గెలుచునె
నేనన్నది నువ్వయ్యానని నీలోని నన్నే అడిగే.....
నీకోసం తపించె మనసే తప్పన్నది చేయని తనమే............
చరణం2
ఏడేడు జన్మలదాకా ఎగిసిన బందమిది తెలుసా
శ్వాసించే ఆయువు చివరన నిలుచున్నది నీవే చెలియా
మరణించే ఘడియ దాకా మనసన్నది నీదే సఖియా
చెదిరిపోని కలలకి రూపం రమ్యమైన మన జీవన యానం
వస్తా నేనొస్తా నీ ప్రాణాపు కొమ్మకి పువై మెరుస్తూ....
ఉంటా కొలువుంటా నీ వలపుల పంటలో దాన్యపు రాశినై...........