4, అక్టోబర్ 2018, గురువారం

చైతన్య ప్రకాశ్ కి అక్షర నివాళి

ఏమని చెప్పాలి
ప్రతీ శ్వాస చివరన మెలకెత్తే ఒక ఆశల వారది చివురించునని
ఎంతని చెప్పాలి
చైతన్యపు దారుల్లో అది చివురించుననీ
ఇది జీవితం ఇదే కదా జీవితం
ఇంతే కదూ జీవితం
విప్లవమే సత్యమని
విదూషక జీవితమిదని
‌సత్యాన్వేషణ తగదూ తగదిదని
చాటినా....
నమ్మేదెట్లా
నడిరేయి చీకట్లు
చుట్టుముట్టి పాతేస్తే పోయేదెట్లా
అయ్యే పోయితివెట్లా...,
ఇదీ జీవితం ఇదే కదూ జీవితం
ఇంతే కదా జీవితం....
పోతే సమాది ఔనా
పోయింది విలువలేనిదనా...
కాదూ కాదిది సత్యం
కానరాని వెలుగుల చైతన్యం
చూడరా ఆ సమాది కిరణం...
హెచ్చు తగ్గుల క్రీడ
సమాజ తప్పుల తక్కెడ
ఏనాడు సమాదౌనో
నాడే నా మరణం
అనాడే‌ నా జననం
అందాకా
ఏమని చెప్పాలి
ప్రతీ శ్వాస చివరన మెలకెత్తే ఒక ఆశల వారది
చివురించుననీ
ఇప్పటికిక సెలవూ
రేణ రాగాలిక షురువు
ఇప్పటికిక సెలవూ
చైతన్య ప్రకాశికల దరువూ
ఇప్పటికిక సెలవూ
పర్శయ్య నీ ఆవేదనల నెలవూ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి