4, అక్టోబర్ 2018, గురువారం

తనలోనే నేనూ


నేనేమో తనూ
తనలోనే నేనూ
అద్భుతం ఈ ప్రయాణం
ఒక్కోసారి అనిపిస్తుంది
నువ్వు కలువకపోతే
నీ జతే కుదరకపోతే
తనలోనే నేనున్నప్పుడు
నాకోసం తను వేచి చూసేప్పుడు
ఇంకా ఈ ఊహెందుకు
కాదనే లేదనే ఊహలకే అస్కారం లేదు
చెలిమికి చెలియవు నీవు
చలించే హ్రుదయానివి నీవు
ఒక్కో వసంతం నీతో కలిసి గడిచిపోతుంటే
గడియలా జీవితం సాగినట్లుంది
కమ్మని కోయిలలా నీ గొంతు వింటుంటే
మామిడి పూతలా వర్ణరంజితమైంది
ఈ పంచ భూతాలు ఎంత నిజమో
నీ వెనుక నేనున్నాననేది అంతే నిజం
నీ కోప తాపాలు నీ బుంగమూతులూ
నీ రుసరుసల విరుపులు సైతం
తొలకరి మోఘ గర్జనల్లా వినిపిస్తాయి
పురివిప్పే మయూరం నేనేకదా మరి
చల్లని వెన్నెలకి
చక్కని స్నేహానికి  
హ్రుదయపూర్వక వందనాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి