4, అక్టోబర్ 2018, గురువారం

నాలో నేనే జారిపోయాను

ఎందుకో నిన్ను చూసిన ప్రతీసారి నన్ను నేను మరిచిపోతాను
ఒద్దికగా నువు మాట్లాడిన ప్రతీసారి నాలో నేనే జారిపోతాను
నువు నవ్వితే నా పెదాలు విరబూస్తాయి
నువు నడిస్తే నా పాదాలు చలిస్తాయి
భావన నీదైనా అనుభూతిని మాత్రం నేనే
బాద ఏదైనా బతుకు మాత్రం నీతోనే

ఒక్కోసారి
రెప్ప వాల్చాలంటే బయమేస్తోంది
కమ్ముకొచ్చే నిద్రని నీ రూపం కబలిస్తుందని
ఎలా చేరానో తెలీదు ఎవరెస్టు అంచుకు
బహుషా నువ్విచ్చిన దైర్యమేమో అది
నువ్వున్నావనే గమనమేమో అది
నేలా నింగీ నిప్పూ
అన్నీ నన్ను చూసి ఈర్షపడుతున్నాయి
వాటినొదిలి నువు నా వద్దకొచ్చావని
పరాకులో ఏమరుపాటులో నైనా
నీ ద్యాసలో బతకడమే తెలుసు
ప్రపంచమంతా పాదాక్రాంతమైనా
నువ్వున్నప్పుడే నాది గెలుపు
నేనేం చెప్పినా నమ్మకు
నా మనసు చెప్పేదే వినూ
నేననేది మిగలకపోవచ్చు
నా ఆత్మ నిన్ను వదలకపోవచ్చు
నే కోరేది అదే
నీ దరే
అందుకే, నిన్ను చూసిన ప్రతీసారీ నన్ను నేను మర్చిపోతాను ప్రియా.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి