8, అక్టోబర్ 2018, సోమవారం

రాజ్యం వీరబోజ్యం రైతుల్ని వేదించే సమాఖ్య సూత్రం


ఇది రాజ్యం
రాజ్యాంగ రక్షణలతో కూడిన రాజ్యం
రాజ్యమే రాబందులా మారిన రామరాజ్యం
సబ్కో సన్మతి తెలిపిన మహాత్ముని బాట మరిచిన బోజ్యం
లక్షల కోట్ల కార్పోరేట్ల కుఠిల నీతి దారిలో సాగే వసుదైక సౌమ్యం
నా ప్రజాస్వామ్యం

ఇది బోజ్యం
బోషాణాల సంపదనెల్లా బడా దొరల బొక్కసాల నింపే బోజ్యం
బ్రతుకు తెరువుల బక్క ప్రాణాలని గడ్డిపోచల్లా తీనేసే బోజ్యం
దరలులేక, ఆదరణ లేక అడుగంటిపోతున్న సేద్యంతో
కరెంటివ్వక, నీరులేక ఓవైపు రైతన్న నీరుకారిపోతున్నా
శాంతియుత నిరసనలపై గ్యాలన్ల కొద్ది క్యానన్లని విసిరే రాజ్యం
అందుకే
రాజ్యం వీరబోజ్యం

రోజుకి మూడువందల కోట్లు సంపాదించే బీదల కోసం రాజ్యం కానీ
28 రూపాయలు ఖర్చుపెట్టే నవాబుకి ఇంకేం చేస్తాం
ఖార్ఖాణాల రీపైనరీలు ముఖ్యం కానీ
గోడ్డు గోదతో మట్టిని నమ్ముకొనే రైతుకి ఇంకేం చేస్తాం
పరమ పవిత్ర రాజ్యాంగమిది, రాజ్యమిది
అందుకే
రాజ్యం వీరబోజ్యం

మేమిచ్చిన అదికారంతో
పంచెయ్ అంబానీకో అదానీకో...
దోచెయ్ రక్షణలో రాఫెల్లో....
చిదిమెయ్ అవకాశాల్నో ఆశల్నో....
తీసేయ్ గాందీనో గాందేయ వాదుల్నో....
చంపెయ్ రైతుల్నో రక్షకుల్నో....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి