27, మార్చి 2020, శుక్రవారం

అనంత సౌందర్యం


వెన్నెల రాత్రిలో
చల్లని గాలిలా
పిల్లగాలి తుంపెరలకు
నడకలు నేర్పుతున్న నీ కురులు
సముద్రపు అలలకు
సవ్వడులు చేరుస్తున్న నీ మువ్వలు
సిరిమల్లె వసంతాలకు
వాసనలు చూపిస్తున్న నీ పెదాలు
గగన సీమకు సొగసులద్దుతున్న
నీ నడుము వయ్యారాలు
చిలకలకు పలుకులు నేర్పుతున్న
నీ ముత్యాల మాటలు
వర్ణించే కవుల హ్రుదయాలకు భావుకతను
వరించే ప్రియుని మనసుకు అమరత్వంను
ఆపాదిస్తున్న నీ అనంత సౌందర్యాన్ని
వర్ణించే నా ఈ కలం
అమరత్వాన్ని పొందినది
తెలుసా... ప్రియా.... ----04.07.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి