31, మార్చి 2020, మంగళవారం

పరిమళ ఉగాది



పరిమళం నిండిన ఓ నవసంవత్సర ఉగాది
స్వాగతం సుస్వాగతం
నీవొచ్చిన వేళ నా ఇంట ఆనంద హేళ
కానీ
నీవుండేది నీవాడిపూల పరిమళాలుండేది ఒక్కరోజే
ఈ ఒకరోజు పరిమళాన్ని నా ముక్కు పుటాలలో ఎన్నిరోజులు బందించగలను
పూలు పూసాయి... ఈ లోకంలో మేమే అత్యదిక అద్రుష్టవంతులం
అని భావిస్తున్నాయి కాబోలు
కానీ
వాటి ఆనందాశ్రువులను జుర్రుమని పీల్చుకోవడానికి వస్తున్నది అదిగో ఆ అమ్మవారు
అమ్మవారు ఆ పూలను కోసినా... పాపం పిచ్చిపూలు
మేము అందరికన్నా మిన్నగల అందాల పుష్పాలం అందుకే మమ్ము తీసుకొని పోతున్నది
అని భావిస్తున్నాయి కాబోలు..
కానీ
అలా కాదని ఎవరు చెప్తారు వాటికి
పరిమళం వున్నంత వరకూ వాడుకొని
వాడిపోగానే వదిలేస్తారు అని ఎవరు చెప్తారు దానికి
అదీ ఇంట్లో కాదు మురికి కాలవ పక్కనున్న చెత్త కుటీరంలో
పాపం
పరిమళానికి ఏమి తెలుసు తను అనంత వాయువులలో మిళిత మైనానని.                2001 ఉగాది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి