27, మార్చి 2020, శుక్రవారం

నా మనసు ఏమంటుందో తెలుసా...


మౌన రాగాలతో ఉషోదయం
పొద్దుపొడుపును తన్నుకొస్తుంది
మూగ భావాలతో అనుక్షణం
మనసు రాగాలను కురిపిస్తోంది
మల్లెల సొగసుల కోసం
కోయిల కంఠం కోసం
నా మనసు
విరబూసిన వెన్నెలలా
వేకువ జామునే వికసించింది
ఊహల పల్లకీలో ఊరేగుతోంది
కలల సౌదాలను కంటి చెణుకులో దాచుకొని
మెరుపు వేగంతో మేలు అశ్వంలా
పరుగెడుతోంది
ఏదో తెలుసా.... 
కొండెక్కి కూర్చున్న గొంతెమ్మ కోర్కెలు తీర్చే...
నా మనసు...        ----04.07.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి