27, మార్చి 2020, శుక్రవారం

ఇలా నువ్వుండు


ఆలోచనలతో ఆకాశం లోని చుక్కలను లెక్కించు
ఆవేశంతో భూలోకంలోని నరకులను ఖండించు
తరంగ చలనంతో సుదూర తీరాలను చేదించు
తపన, తన్మయాలతో తరగతి గదులలో ముందుండు
తరగని జిజ్ణాసతో విశ్వంతరాలను చేధించు
తళ తళ మెరిసే వరాల కత్తినే నువు దరించు
చిరునవ్వుకు చిహ్నమైన తల్లిప్రేమనే నువు స్ప్రుశించు
మదన తాపాలకు నిలయమైన ప్రేయసినే నువు వరించు
ఆశల హంగుల ఆర్బాటాలనే నువు త్యజించు
అవకాశాల నిచ్చెనలనే ఆశల సౌదాలనుకో
ఓ జీవి, నిశిది జీవాలలో నిశ్చల హ్రుదయానివే నీవు    ---24.03.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి