27, మార్చి 2020, శుక్రవారం

జాబిల్లిని ముద్దాడిన మన్మద రేకులు


రాతిరి పూల జడివాన హోరుగా కురిసింది
వేకువ తెలవారుతుండగానే వెన్నెల మాయమయింది
స్వప్నపు చిగురాసే అనుకుంటాను! నేను!
కానీ
కనుల చిత్రాలన్నీ గుమిగూడాయి ఒకచోటే
వలపు వినీలాకాశంపై విరబూచిన
వేకువ తారవని నిన్ననుకుంటాను
కానీ
నట్ట నడిజామునే వెన్నెలెక్కడిది
వసంతం రానిదే వలపు సుడులు తిరిగే
పూల తీగెక్కడిది! ఏమో ఐనా!
మెరిసే మెరుపు కూడా క్షణ కాలమే
చినుకు కురిసేది కూడా నేలపైననే... ఏమో
జాబిల్లిని ముద్దాడే మన్మద రేకులన్నీ
విచ్చింది ఈ వేలనే కాబోలు!          ---18.07.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి