27, మార్చి 2020, శుక్రవారం

తొణికిన కుండ


తొణికిన కుండ నా జీవితం
విది వంచితమైనది నా అస్థిత్వం
చిగురుటాకులోని పచ్చదనం
చిరునామా ఎక్కడని వెదకమంటావ్
మనసుని బండగా చేసుకున్నా
మమతలను మాత్రం మరువకున్నా
మద్యతరగతి బ్రతుకు కన్నా
గడ్డిపువ్వు పటుత్వం మిన్నా
నడువరాని బురదలో నే కొట్టుకున్నా
ఆకాశంలోని తీరాలను
తప్పకుండా నే చేరుతానన్నా.... ---10.04.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి