27, మార్చి 2020, శుక్రవారం

నమ్మదు లోకం


కన్నీటి చుక్కలను మురికి కాల్వలో వేసి
కథల నావలను నే పరిగెత్తిస్తానంటే
ఆకాశంలోని మేఘాలను పక్కకు నెట్టి
అందమైన పందిరి నేనల్లుతానంటే
ఉరుకుతున్న జీవితపు గడియారపు ముల్లును
ఉల్లిపాయల ఘాటుతో నే నింపుతానంటే
సముద్రంలోని ఉప్పును కూడా
హారతి కర్పూరంలో నే చేస్తానంటే..
నమ్మదు లోకం!
నడువదు కాలం!                  ---31.03.2000

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి