4, ఏప్రిల్ 2020, శనివారం

శిథిలాల కింద మానవ స్వప్నం (2001 కాలేజి డే సెకండ్ ప్రైజ్ కవిత)సమాజపు సంకెళ్ల నుంచి
శిథిలాల దుబ్బలోంచి
మట్టికమ్మిన మైకంను వదిలి
చెలిమి వెన్నెల జలకాలాడి
కొత్త ఆశల చిగురులు తొడిగి
ఎదురుచూస్తున్న వెలుగుల కోసం
తెల్లారుదంటూ వచ్చే సూరీడేడి...
హేమంత రుతువు రాగం కోసం
కమ్మగ పాడే కోయిలమ్మేది
భవన భాండలము పొంగక ముందున్న
అమ్రుత దారల గోమాతలేవి
అల్లరి పాటల చిన్నారులేరి
నా మనసులో...
ఎగురుతు గెంతిన స్వప్నాలేవి
లెక్కకు మించిన బందాలేవి
అనురాగాల ఆనందాలేవి
ఇన్నీ తెలుసుకోవాలని...
తపన పడుతూ తలపుల తలుపులు తెరిచిన నాకు
తెలిసిందొక్కటే చేదు నిజం
క్రుంగిన భూమి పొరల పైన
కమ్మిన శిథిలాల కింద
మానవ స్వప్నం కునుకు తీస్తుందని
ఇంకా...
ఎంత సేపున్నా ఏం లాబం
ఏ దారిన వెతికినా ఏం సాద్యం
నను బతికించిన నా ఆశల స్వప్నం
అది శిథిలాల కింద మానవ స్నప్నం.         ---01.02.2001

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి