వెల్తుంటే.. వెల్తుంటే.. నిశీది తీరంలో..
తెరమంచు చాటులోంచి సూధీర కిరణమెకటి
సమీర తుషారమై తాకిందొక మంచుబిందువై
చిరుజల్లుల స్నేహాన్ని పంచుతూ...
మరుమల్లెల మంచితనాన్ని వెదజల్లే
చల్లనైన అమ్మ మనసు నీది
తరగని గజిబిజి తలుపులెన్నున్నా..
చెరగని చిరునవ్వుల సుధవై
అస్తమయం ఎరగని సూర్యునిలా..
అమావాస్య తెలియని చంద్రునిలా..
అలుపెరగని యోదునిలా
ఆశ్రువులనే ఆనందాలుగా చేసుకొని
ఆకాశమే హద్దుగా ఉంచి
అక్షరామ్రుతాన్ని పంచి
ఆదర్మాన్ని అధిగమించి
అమరుడవై జీవించాలి
చిరకాలపు చెలిమి సుధవై.... - కర్రి నాగరాజు 2004
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి