4, ఏప్రిల్ 2020, శనివారం

సర్కారు తకరారు


పొగలు ఎగజిమ్ముతూ
ఇజాలు కలబడుతూ
పెదాలు విడివడుతూ
నిజాలు కలబోస్తూ
నిప్పులు చిందేస్తున్నాయ్
కనబడని కష్టాల కాష్టంలో

ఒకరికొకరితో పోరు
నిలువునా చీలికలతో తకరారు
రోజూ యుద్దాల జోరు
ఇదీ జరుగుతున్న తీరు
మనసుల్లో మసిని పూసుకొని
మనుషుల్తో బేరం చేస్తున్న రౌతు ఈ సర్కారు
దోచడమే తెలిసిన దొరగారు
దొరకబుచ్చి చంపుతే కాదని నువ్వంటావా !
కాలడమే తెలిసిన కడుపు
తిరగబడి ప్రశ్నిస్తే నింపడానికి నువ్వుంటావా!
హు... ఇదంతే...
అక్కడ శవాలు తగలబడ్తూనే ఉంటాయ్
రాబందులు రెక్కలు కట్టుకు తిరగడానికి!
స్నేహాలు అంతరిస్తూనే ఉంటాయ్
ఎరుపెక్కిన కన్నీళ్ల ఊటలలో నిలువడానికి....!         ---24.01.2005

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి