4, ఏప్రిల్ 2020, శనివారం

విరహంపిలుపు వినబడ్తుంది
పరవశాన్ని మీటే కోటి రాగాలతో...
తొలి సంద్యవేళ వెచ్చని ఉషోదయ కిరణాలు
నా లేలేత హ్రుదయంలోకి జారుతున్నట్టుగా
చల్లని తుషార సమీరంలో
జాబిలమ్మతో ఏవో ఊసులాడుతున్నట్టుగా

సొగసు కనబడ్తుంది
పసిపాప బోసినవ్వులాంటి నీ బుగ్గల్లో...
అర్థరాత్రి అలుముకున్న నీ రూపం
నన్ను అసాంతం ఏకాంతంలోకి లాక్కెళ్తే
శ్వాస ఆగిపోయింది ప్రతిగా..
నీ ఊహ నను అల్లుకుంది
నిదుర నిదురోయింది ఈ రేయి
నా కనులలో అశువుగా నీ రూపం చూసి
సఖీ...
ఏం జరిగింది అని అనను
అదేదో తెలుసుకోడానికే
ఈ హ్రుది తపన పడుతోంది
నవ్వే నువు నాలో ఉన్నన్నాళ్లు
అధ్యంతం విద్యాగందం పంచే సుమమే నేను....                  06.01.2005

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి