ప్రేమతో నిండిన చూపులతో
ఆర్ధ్రతతో నిండిన ఆశలతో
ఆకాశంలోని చుక్కల మాదిరి
ప్రయాణంలోని మలుపుల మాదిరి
వెతుకుతున్నా... వెలుగుతున్న... సాగుతున్నా...
నా ఊహలలో తేలియాడే
స్వప్న సుందరి కోసం
ఆకాశంలోని హంసలను అరవు తీసుకోవాలా!
భూమాత మీది అణువణువునూ అర్థించుకోవాలా!
గుండెలో రక్తం నిలిచిపోయినా...
గూడులో కష్టాలు పలకరించినా..
నా ఊహ ఉంటుంది
ఊపిరున్నంత కాలం
నా మనసు వెదుకుతుంది
ఆమె కలిసేంత కాలం... ---19.11.1999
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి