కళ్లనీళ్ల కెరటాలతో సంద్రముప్పొంగుతుంటే
దారల జలదారలన్ని కన్నీళ్లనే మింగుతుంటే
కష్టాల బెదిరింపులు, చీత్కారాల సత్కారాలు
చాలు చాలు చాలంటూ...
పిడికిళ్లు బిగుస్తున్నాయ్
పద పద పదమంటూ...
అడుగులు కదులుతున్నాయ్
పోరాటం సాగుతున్నా...
బలిదానం జరుగుతున్నా...
నిస్తేజమైన నీ చేతన ఇంకెన్నాళ్లు
అన్యాయం జరుగుతున్న
ఆక్రందన మిన్నంటినా
పిచ్చిపట్టి రెచ్చగొట్టే ప్రేలాపన ఇంకెన్నాళ్లు
ఇంతేలే అనుకోకు ఇంతటి ఈ మహోద్యమాన్ని
అణచాలని ఆశపడకూ అలాయ్ బలాయ్ సంఘటితాన్ని
నాజీల ఘోరీలు, బాధ్షాల భంగపాటులు
నియంతల నివ్వెరపాటులు
చూడు చూడు చూడు
తెలంగాణ రథచక్రాల్
హక్కులకై సాగుతున్న అంతిమ పదఘట్టాల్ 25.07.2011
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి