4, ఏప్రిల్ 2020, శనివారం

విద్యార్థి స్నేహం


సూర్యుని నయనాలు వాలే
ఈ నేలంతా రమణీయం
మీ ఆశల తీరాలు తాకే
ఆ క్షణమెంత కమనీయం
ఉప్పెనల్లే ఆవేశమొచ్చినా
ఒరవడిలాంటి ఆలోచనొచ్చినా
తడబాటు లేకుండా జరిగిపోవాలంతే...
పొరబాటు లేని బడిబాట మీది
నిరాశేలేని అలపాట మీది
ఈ విది నాకిచ్చిన గొప్ప వరం నీ స్నేహం
ఆశయాలు అలసినప్పుడల్లా సందేశం నీ స్నేహం
ఈ అక్షరం
ముగించాలంటే భాష బాదపడ్తోంది
అమ్మలాంటి ఆరాదన కోల్పోయిన వైనం స్పష్టమవుతుంది.                        ---07.12.2004

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి