4, ఏప్రిల్ 2020, శనివారం

నా తెలంగాణ శతకోటి ప్రభాతాల వెలుగు


ఈ తొలి ఉషోదయాన విచ్చుకున్న నీ చిన్నికళ్లు
నాకు కర్తవ్య కాంతిలా దారిచూపుతున్నాయి
ఎన్నెన్నో అవరోదాలతో
అదఃపాతాలానికి అణచబడిన నా అయ్య ఆశయాలను గుర్తుచేస్తూ..
ఎన్నెన్నో అవమానాలతో
క్రుశించి నశించిన నా అన్న అమరత్వాన్ని అనుక్షణం నా కళ్లలో కదలాడిస్తూ...
మరెన్నో భానిస కట్టుబాట్లతో
బతుకీడుస్తున్న నా తమ్ముణ్ని బరిలో దింపుతూ
అన్నా, అక్కా, తమ్ముడు ఒకరేమిటి
నాలుగుకోట్ల నా సహోదరుల ఆశలకు ఊపిరులూదుతూ
నవశకానికి నాందిగా
ఆత్మగౌరవపు గుర్తుగా
వచ్చే వసంతాల సాక్షిగా
కొత్త గొంతుక విన్పిస్తాం
వెన్నుచూపక ప్రతిఘటిస్తాం
ఏమని....
నా తెలంగాణ కోటిరతనాల వీణని
నా తెలంగాణ శతకోటి ప్రభాతాల వెలుగనీ....            07.01.2010

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి