4, ఏప్రిల్ 2020, శనివారం

కృశించే ప్రపంచం


దృశ్య హస్తపు బరువు దెబ్బకి
ప్రపంచం పాతుకుపోతుంది
ఆగాదపు అంచులోకి

చలి సమీరం మెదలైన చోట
చెలి కుచ్చిళ్లతో చలికాచుకొనే సోమరిపోతు
అర్థనాదాల ఆకలి కేకల్ని
అరచెవితో వినే అసమర్థ రాజులు
ఏం చేద్దాం! ఏదో ఓటి చెయ్యాలి
ఇంకా దిగబడినదో ఇక నిలబడడం కష్టం
పాపాల పశ్చాతాపాల్ని దింపేద్దామా బదులుగా...
కానీ...
బహిర్గతంగా బట్టబయలు పర్చేనా.. రాజులు తమ క్లాజులు
ఎమిటో...
ప్రపంచం కుచించుకుపోతూనే ఉంది
పొత్తిళ్లలోని కన్నీళ్లలో కరిగిపోతూ...                    10.10.2005


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి