లాహరి పాటల ఊగిసలల్లో చిరుజల్లుల దరహాసాన్ని
చూస్తూ...
యవ్వన వెన్నెల చల్లదనంలో మేఘాల పందిరి ఊయల కింద
ప్రచండ శభ్దపు కేరింతలతో ఊ..ఊ.. పాటల కమ్మదనంలో
అమ్మపాలు తేనెలొలుకగా
పెరిగిన భాల్యపు స్మ్రుతులే కదా!
ఐనా ఏం లాబం!
కొట్టుకు చచ్చే జనాల మద్య
గుబులు పుట్టించె చీకటి లోనా
వింత మ్రుగాల కొత్త పోకడలకు
లొంగిన నేనొక జీవచ్చవం
రామ రాజ్యం రావాలని
కడుపు నిండుగా తినాలని
ఊహలలో ఊరిళ్లు నింపుతూ...
మూలిగిన నేనొక జీవచ్చవం
బ్రతుకు బాట చిన్నదేయని
దారంతా చీకటెట్లనీ..
నడుస్తుంటే తరగదేమని
జగతినిండా వెన్నెలున్నా..
ప్రగతి లేదేం తెలంగాణా
ఎవరొస్తారో అని ఎదురు చూసిన నేనొక
జీవచ్చవం
పొట్టి శ్రీరాములు నే కాలేనా...
వయసులో సత్తువ నాకులేదా..
సాగిస్తానులే నేనొక విప్లవ నాదం
తెలగాణ సంకెళ్లు తెగిపడే రణ నినాదం ---01.02.2001
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి