4, ఏప్రిల్ 2020, శనివారం

శిథిలాల కింద మానవ స్వప్నం


బ్రతుకు దారిలో నడిచిన రాత్రి
చినుకు కురిసినా పొంగని దాత్రి
గుండెలో ఆర్ధ్రత పలకరిస్తున్నా...
ఆరిపోతున్న ఆశల సమీరం ఇంకా మెరుస్తూనే ఉంది
పెరిగిపోతున్న జీవపు దేహం ఎప్పుడో చచ్చింది
కారణం కోసం వెదకని చోటంటూ లేదు
తిరగని దారంటూ లేదూ
చూస్తే ఏం లాబం...
శిథిలాల కిందుందిలే మానవ స్వప్నం
పలకరిస్తూ.. చేయిచాపినా చచ్చిందిలే ఎప్పుడో ఆ స్వప్నం      01.02.2001

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి