4, ఏప్రిల్ 2020, శనివారం

కాలంఈ సాయం వేళ సంద్య సూరీడ్ని
గతంలోకి లాక్కుపోతుంది
గమనం ముగిసిన ఈ కిరణం

వేవేళ విద్యుల్లతలు ఒక్కసారి తాకినట్టుగా
అలసిన కనుపాపలు ఓదార్పు కోరినట్టుగా
సరసమైన కథల ఊసుల్ని
ఓ ప్రభాత వసంతాన నాతో పంచుకొని
జఠిలమైన శిలలా అంతరంగాల్ని
నాకు ఓ నిశీ రాత్రిన చవిచూపించి
తొణికిన సగం స్వప్నాన్ని
నా కళ్లలో నిదురించమని
ఏమని చెప్పనూ..
సంవత్సరం సాగుతున్నప్పుడల్లా..
గుర్తోచ్చే.. పెరిగే వయసుని
వరదలా పొంగే అనుభవాల ఆశల్నీ
ఎంతని చూపను....
అంతరంగంలో అలజడి మెదలై
ఆగని గతకాలపు జ్ణాపకాల దొంతరని
నడవడం సాగుతున్నప్పుడు
అడుగు వెనకకు జారుతుంది కదా...
అలాగే... ఇదీ అంతే....              31.12.2004

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి