4, ఏప్రిల్ 2020, శనివారం

అమర ప్రేమ


చిరునవ్వుల వెన్నెల్లో చెలి కిలకిలా రావాలు
పరువాల హోయలతో పలకరించే తెమ్మెరలు
నీ చూపు తాకిన ప్రతి చోటూ
సూర్య చంద్రులకి ఇలవెల్పూ
నీశ్వాస నిండిన ఈ పవనం
నిండు మల్లల సమ్మెహనం
నీ అడుగు మోసిన ఈ భువనం
అందమైన నందనవనం
వేకువ విసిగిస్తుంది
నా కనురెప్పల మాటున నీ రూపుని విరిచేస్తుందని
మౌనం మరిపిస్తుంది
నీ గలగల కేరింతలు నా చెవుల నిండాయని
ప్రాణం పరితపిస్తుంది
ఉఛ్చ్వాసం నిశ్వాసం నీ తలపున చేరాయని
అమ్మతో నిండిన ప్రేమ ఆకలెట్ల మరిచిందో
నీ ప్రేమతో నిండాక అమరజీవినయ్యానని
స్వఛ్చమైన అందమైన నా ప్రేమ
మన మనసుల ముడివేసి ఒక్కటిగా చేసేసి
ఆత్మని పరమాత్మని పంచభూతాలని
సప్తవర్ణాలని పలికించు, వినిపించు నీ ప్రేమతో బతికించు                  04.05.2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి