4, ఏప్రిల్ 2020, శనివారం

మరో వత్సరం


 ఈ సంవత్సరం నిశ్శబ్దంగా జారిపోయింది
అవ్యక్త భాధనీ... ఓ  ఆశనీ..
మౌనంగా నాలోకి పంపి.
అపుడెపుడో మెదలైనట్టుంది
అంతలోనే అయిపోయినట్టుంది
ఎన్నో సహస్రాభ్దాలని చవిచూసిన నా మనసు
ఈ రోజు చివరి క్షణాన్ని మాత్రం ఆహ్వానించలేకుంది
సాగిపోయే అలలపై సునామీలొచ్చినా
కదిలిపోతున్న కాలం కరువుని చూపించినా..
వత్సరం ముగియడమే ఒక ఉత్సవం                             30.12.2004

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి