4, ఏప్రిల్ 2020, శనివారం

విరహంశ్వాస ఆగిపోయింది, మనసు నిలిచిపోయింది
కన్నుల్లో నిలిచిన నీరూపం
కన్నీళ్లై ఉబికి ఉరికొస్తుంది
ఎంతకూ నిలవనన్న ఈ ప్రాణం
నువు లేవని సెలవని వెలిపోతుంది
వేడుక గతమైనది
వేదనే నేడున్నది
తనువులో కలిసిన నువ్వు
విడివడి వెలితే అది ప్రాణమే
ఈ నిశిదిని ఏలే చీకటే
నువులేని నా జీవితానా
ఇంతేనా... మరణమేనా..
ఊహల్లే ఊరేగాను
భవితంతా వెలుగొందాను
ఇద్దరమెకటై నిలిచి
ఈ జగతికే వెన్నెల పరచి
బ్రతుకొక స్వర్గమై
నీతో ఏడడుగుల బందమై అనుకున్నా... కలగన్నా...  ---09.05.2010


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి