1, ఏప్రిల్ 2020, బుధవారం

ఇది జీవన వేదం



అమ్మ పాలు తాగి ఆకలి
ఆకలి తీర్చుకున్న రోజున
ఆకాశాన్నే హద్దుగా చేసుకొని ఆడుకున్న రోజున
కనిపించిన కారుమబ్బులన్నీ కలకాలం
ఉంటాయనుకున్న రోజున
కనిపించలేదు కారుణ్యం
వినిపించలేదు అర్థనాదం
కానీ
ఆకలి తోటి మాడుతున్నాను
ఆదుకునే వారే లేరా..
కడుపు చిక్కి శల్యమోతున్నాను
శరణుజొచ్చేవారే లేరా అని
ఎన్నాళ్లు.. ఎన్నాళ్లు... అడుక్కుంటావ్
లే...లే...లే.. నీ గమ్యం అక్కడుంది
నీ తీరం అక్కడుంది
ప్రయత్నం అనే పడవలో ఎక్కి
సుడిగుండాల సముద్రాన్నే దాటు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి