1, ఏప్రిల్ 2020, బుధవారం

హంసను నేనై


ఆకాశంలోని మబ్బులోంచి జాలువారే..
నీటి చుక్క కోసం వేచి చూస్తున్న హంసలాగా..
ప్రియురాలు కోసం పరితపిస్తున్నా....
 మనసును కదిలించే ప్రేమ కోసం
పర్వతములా నీముందు ఎన్నాళ్లిలా వేచి చూడాలి!
కనీసం కంటికి కునుకైనా.... దొరకనివ్వవా
ఆకాశం లోని మబ్బుల్లో
మెరుస్తున్న ఇంద్రదనుస్సు నువ్వని
నాగిని తలపై మెరుస్తున్న
మంచి మాణిక్యానివి నువ్వేనని తెలుసు నేస్తం
నేను నీ కోసం
ఆకాశ తీరాలను చేరాలా....!
                                                     నాద స్వరాలను పలుకాలా….!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి