4, ఏప్రిల్ 2020, శనివారం

యుద్దం


యుద్దం, యుద్దం, యుద్దం
అంతటా యుద్దం
అశాంతికి అకలేసిందేమో
శాంతిని భూస్థాపితం చేసేందుకు
సకల సోపానాలను వెతుక్కుంటుంది

అర్ధరాత్రి నిదురిస్తున్న వేళ
అర్ధాకలి కభలిస్తున్న వేళ
అమ్మపాలు వర్షిస్తున్న వేళ
ఆకాశంపైకి అడుగేస్తున్న వేళ
ఏ వేళైనా.. వేవేల ధుశ్శకటాలు
నిరాఘాటంగా.. నిరాటంకంగా..
కరాళ న్రుత్యాన్ని కొనసాగిస్తున్నాయి
కమిలే శవాల కమురు వాసనలో...

కన్నీరు చినుకుతూ అంతరిస్తున్న తడి ఒకటైతే
అనంతంగా పొంగుతూ ఆర్పేస్తున్న జడి ఒకటి
ఇప్పుడు
నేను సైతం వినాశనానికి ఉగ్రరూపం
ఊయల్లోని పసిపాపకి సైతం సింహస్వప్నం
అశాంతే నా ఆకలికి తుదిరూపం
అన్యాయమే ఈ ప్రపంచానికి మలివేదం
జరిగిందేదైనా... జరిగేదేదైనా..
జ్వలించే బడబాగ్ని ఈ యుద్దం               07.02.2004

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి