4, ఏప్రిల్ 2020, శనివారం

కొత్త సంవత్సరం


నడుస్తున్నకొద్దీ తెలుస్తుంది
దూరం తరుగుతుందని
అడుగు, అడుగు, ఒక్కో అడుగు
గమనాన్ని లాక్కుపోతున్నాయ్
గాలి చప్పుళ్లకి విరిగిన
ఆకులన్నీ గతాన్ని వెతుక్కుంటున్నాయ్
చితికిన ముక్కల నడుమ
అంతే...
ఆగకుండా సాగడేమే
దానికి తెలిసిన నిజం
పోటొచ్చినా... గుండెపోటోచ్చినా..
నిశ్శబ్దయానం చేస్తూ...
నిజాన్ని మరిపించడమే దాని నైజం

చరిత్ర, కీర్తి, ఘనత
ఎన్నిపేర్లైనా ఎగదోసి
సడిచెయడమే దానికిష్టం
సంవత్సరానికో అడుగుచొప్పున
ఆనక కావలించే చావు చెంతన
మన జీవితాలు సమాగమిస్తాయి
బ్రతకడం తెల్వని మనకు
బయలుదేరుతున్నవి నెలలైతేనేమి
సంవత్సరాలైతేనేమి
నడువడమే దాని నైజం
నూతన గతిరేఖల సమాగమం
ఈ కొత్త సంవత్సరం.                           ---29.12.2004

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి